ETV Bharat / bharat

ఉపాధి పేరిట మోసపోయి.. 1200 కి.మీ. కాలినడక - ఉద్యోగం పేరిట మోసంపోయి

ఝార్ఖండ్​కు చెందిన ఓ వ్యక్తి.. దిల్లీ నుంచి 1200 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామని.. అతడ్ని దిల్లీ తీసుకెళ్లిన కొందరు ఏజెంట్లు మోసం చేశాడు. దీంతో ఇంటికి వెళ్లేందుకు డబ్బుల్లేక కాలినడకన పయనించిన అతను.. ఐదు నెలలు తర్వాత స్వస్థలానికి చేరుకున్నాడు.

cheated-labourer-walks-from-delhi-to-jharkhand-covering-1200-km
ఉద్యోగం పేరిట మోసంపోయి.. 1200కిమీ కాలినడకన స్వస్థలం చేరి..
author img

By

Published : Mar 12, 2021, 4:22 PM IST

ఉపాధి పేరిట మోసపోయి.. 1200 కి.మీ. కాలినడక

ఉపాధి కోసం దిల్లీ వెళ్లి.. అక్కడి ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఝార్ఖండ్​కు చెందిన ఓ వ్యక్తి.. 1200 కిలోమీటర్లు దూరం నడిచి స్వస్థలం చేరుకున్నాడు.

ఇదీ జరిగింది

ధన్​బాద్​ జిల్లాలోని యమనితాకు చెందిన బర్​జోమ్ భమ్​దా పహాడియాకు ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ఏజెంట్లు దిల్లీ తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక అతడ్ని మోసం చేశారు. ఉపాధి కల్పించలేదు సరికాదా.. పహాడియా వద్ద ఉన్న సొమ్మును కూడా లాక్కున్నారు. ఇంటి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితుల్లో.. కాలినడకనే స్వస్థలం చేరాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లేదారి తెలియక రైలు పట్టాల వెంబడి నడవడం ప్రారంభించాడు. దారిలో నీళ్లు ఎక్కువగా తాగుతూ.. దొరికిన చోట ఆహారం తింటూ పయనం కొనసాగించాడు. రాత్రి, పగలు అనకుండా నడిచిన పహాడియా.. మార్గం మధ్యలో తన బ్యాగును పోగొట్టుకున్నాడు.

బ్యాంకు ఉద్యోగుల సాయం

పహాడియా దీనగాథను తెలుసుకున్న కొందరు బ్యాంకు ఉద్యోగులు.. అతడ్ని బస్సు ఎక్కించారు. అలా ఎట్టకేలకు ఐదు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నాడు.

ఇదీ చదవండి: శివలింగ అభిషేక జలం కోసం కాలినడకన 35కి.మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.