ETV Bharat / bharat

చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన ఏసీబీ కోర్టు - టీడీపీ నేతలపై వైసీపీ

Chandrababu Naidu House Custody Petition: చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై రెండురోజులపాటు వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబు పిటిషన్​ ను తిరస్కరించింది.

Chandrababu Naidu house custody petition

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 3:50 PM IST

Updated : Sep 12, 2023, 7:24 PM IST

Chandrababu Naidu House Custody Petition: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్​ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సోమవారం నుంచి మొదలైన విచారణ.. ఈ రోజు ముగిశాయి. కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. పిటిషన్​ను తిరస్కరించింది. చంద్రబాబు హౌస్‌ అరెస్టు పిటిషన్‌పై సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చంద్రబాబు హౌస్‌ అరెస్టు పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనున్న వేళ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు సోమవారం సుదీర్ఘ వాదనలు వినిపించారు. మెుదట జైలులో చంద్రబాబు భద్రతపై అనుమానాలున్నాయని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఏసీబీ కోర్టుకు సమర్పించి హౌస్‌ అరెస్టు అనుతించాలని, న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Arguments on Chandrababu House Custody Petition in ACB Court: తెలుగుదేశం అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. జైల్లో చంద్రబాబుకు భద్రత కల్పించే అంశం పైనే అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా కోర్టుకు తెలిపారు. కరడు గట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో నే ఉన్నారని లూద్రా పేర్కొన్నారు. సెక్యూరిటీ థ్రెట్ ను అనుసరించే ఎన్ఎస్జి లాంటి భద్రత కల్పించారని చంద్రబాబు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీ కి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లుద్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవర్కర్ కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందనీ పేర్కొన్నారు.

చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఏఏజీ సుధాకర్‌రెడ్డి: సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్న ఆయన.. జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు తెలిపారు. జైలు లోపలా, బయటా పోలీసుల భద్రత ఉందన్నారు. పోలీసులు 24 గంటలూ డ్యూటీలో ఉన్నారని.. అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్​రెడ్డి తెలిపారు.

సీఐడీ కస్టడీ పిటిషన్​: చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను 5 రోజుల కస్టడీ కోరుతూ... విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు వేసింది. సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు సమయం కోరిన నేపథ్యంలో కోర్టు వాదనలను రేపటికి వాయిదా వేసింది.

Last Updated : Sep 12, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.