ETV Bharat / bharat

న్యాయం చేయమని ట్యాగ్​ చేస్తే.. చావబాదిన పోలీసులు - jharkhand police

న్యాయం చేయండి అని ప్రముఖ సామాజిక మాధ్యమైన ట్విట్టర్​ వేదికగా పోలీసులను వేడుకుంటే.. అందుకు ప్రతిఫలంగా అతడ్ని వారు (jharkhand police) చితకబాదారు. ఝార్ఖండ్​లోని వెస్ట్​ సింఘుభూమ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Man beaten up by Chaibasa Police for tagging them on twitter
రమేశ్​ బెహరా, కుటుంబం
author img

By

Published : Nov 24, 2021, 5:35 PM IST

ఝార్ఖండ్​​ వెస్ట్​ సింఘభూమ్​ జిల్లాలోని కుమారదుంగి పోలీసులు (jharkhand police).. రమేశ్​ బెహరా అనే వ్యక్తిని చితకబాదారు. తనకు న్యాయం చేయాలని ట్విట్టర్​లో ఆ పోలీస్​ స్టేషన్​ను ట్యాగ్​ చేసినందుకు పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు పేర్కొన్నాడు.

మొదట స్టేషన్​ ఇన్​ఛార్జ్​, ఏఎస్​ఐలు తనకు ఫోన్​ చేసి బెదిరించినట్లు చెప్పాడు బాధితుడు. రాత్రి స్టేషన్​కు రావాలని ఒత్తిడి చేయగా.. అందుకు తాను తిరస్కరించానని వివరించారు. దీంతో కొంతమంది పోలీసులు తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే తనపై చేయి చేసుకున్నట్లు ఆరోపించాడు. అంతేగాకుండా తనను అనవసరంగా స్టేషన్​కు ఈడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు.

"ఈ చర్య పోలీసుల అధికార దుర్వినియోగానికి నిదర్శనం. ఇంట్లో ఉన్ననన్ను స్టేషన్​కు తీసుకెళ్లి.. ఇన్​ఛార్జ్​ అంకిత్​ సింగ్​, ఏఎస్​ఐ ప్రకాశ్​ కుమార్​లు తీవ్రంగా కొట్టారు. దీనిపై వెస్ట్​ సింఘు భూమ్​లో ఎస్​పీకి ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని ఇప్పటికే డీజీపీ, డీఐజీ, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రికి లేఖ రాశాను."

- రమేశ్​ బెహరా, బాధితుడు

బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం అతడు నవంబర్​ 20న పోలీసులను ట్విట్టర్​లో ట్యాగ్ చేశాడు. హోలిన్​ బెహరా అనే విద్యార్థికి బహుమతిగా వచ్చిన ల్యాప్​ట్యాప్​ను.. ఆ విద్యాసంస్థలో పని చేసే అన్మోల్​ రతన్​ అనే ఉపాధ్యాయుడు తన దగ్గరే ఉంచుకున్నాడు. తిరిగి ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశాడు. దీనిని పోలీసులు దృష్టికి తీసుకెళ్లేందుకు రమేశ్ బెహరా​ ట్వీట్​ చేశాడు.

ఇదీ చూడండి: ఒడిశా సీఎం కాన్వాయ్​పై గుడ్ల దాడి- వారి పనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.