ETV Bharat / bharat

'ఆక్సిజన్‌ కొరతతో మీ రాష్ట్రంలో ఎవరైనా చనిపోయారా?' - ఆక్సిజన్‌

కరోనా సెకండ్​ వేవ్​లో ఆక్సిజన్‌ కొరతతో చనిపోయినవారి వివరాలు తెలపాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. ఈ వివరాలను పార్లమెంటులో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

oxygen shortage
ఆక్సిజన్‌ కొరత
author img

By

Published : Jul 27, 2021, 7:12 PM IST

కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన ఘటనల వివరాలు సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం లేఖ రాసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలు పంపిన వివరాలు పార్లమెంటులో తెలిపే అవకాశం ఉందని వెల్లడించాయి.

సెకండ్​ వేవ్​లో ప్రాణవాయువు కొరతతో ఏ ఒక్కరూ మరణించలేదని పార్లమెంటులో వెల్లడించగా ఎదురైన తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ సమాచారం కోరింది. ఇలాంటి మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలేవీ నివేదించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ ఈ నెల 20న ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.

ఇదీ చూడండి: గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.