ETV Bharat / bharat

కరోనా వ్యాప్తి నివారణకు శాసనాస్త్రాలు

author img

By

Published : Jun 19, 2021, 10:34 AM IST

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది శాసన వ్యవస్థల పరంగా అనేక చర్యలు తీసుకున్నాయని 'పీఆర్​ఎస్​ లెజిస్లేటివ్​ రీసెర్చ్​' నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు అంటువ్యాధుల చట్టం-1897కు అనుగుణంగా తాత్కాలిక నిబంధనావళిని రూపొందించాయని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు ఆ చట్టానికి సవరణలు చేపట్టాయని చెప్పింది.

corona, legislative steps
కరోనా వ్యాప్తి, చట్టాలతో కరోనా కట్టడి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది శాసన వ్యవస్థల పరంగా అనేక చర్యలు తీసుకున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 'విపత్తు నిర్వహణ చట్టం-2015'ను ప్రయోగించిన సంగతి గుర్తు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా చట్టాలు/శాసన వ్యవస్థల పరిస్థితిని విశ్లేషించటం ద్వారా 'పీఆర్​ఎస్​ లెజిస్లేటివ్​ రీసెర్చ్​' ఈ నివేదికను రూపొందించింది.

నివేదికలోని ముఖ్యాంశాలివీ..

  • రాష్ట్ర ప్రభుత్వాలు అంటువ్యాధుల చట్టం-1897కు అనుగుణంగా తాత్కాలిక నిబంధనావళిని రూపొందించాయి. కొన్ని రాష్ట్రాలు ఆ చట్టానికి సవరణలు చేపట్టాయి.
  • ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, గుజరాత్​, పంజాబ్​ సహా పలు రాష్ట్రాలు వైరస్​ వ్యాప్తి నివారణకు మార్గదర్శకాలు విడుదల చేశాయి.
  • కర్ణాటక, కేరళ, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​ వంటి రాష్ట్రాలు మహమ్మారిని అదుపు చేసేందుకు ఆర్డినెన్సులను తీసుకొచ్చాయి. తమ రాష్ట్రాల్లో ఏ వ్యాధినైనా సరే అంటువ్యాధిగా గుర్తించే అధికారాన్ని తద్వారా సముపార్జించుకున్నాయి. లాక్​డౌన్​ విధింపు, ప్రయాణికుల తనిఖీ, సరిహద్దుల మూసివేత, జరిమానాల వసూలు వంటి అధికారాలనూ పొందాయి.
  • కొన్ని రాష్ట్రాలు చట్టాల సహాయంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేశాయి. మరికొన్ని.. ఓట్లు వేసే విధానంలో ప్రజలకు వెసులుబాట్లు కల్పించాయి.

ఇదీ చూడండి: Covid Cases: తమిళనాడులో కొత్తగా 8,633 కేసులు

ఇదీ చూడండి: తెరుచుకున్న వైన్స్- మందుబాబులు ఫుల్ ఖుష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.