గంగా నది నీటిలో మృతదేహాల వ్యవహారం పట్ల కేంద్రాన్ని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తప్పిదంపై పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. ఇది సమష్టి బాధ్యత కాదని నొక్కి చెప్పారు.
''గంగా నదిలో మృతదేహాల ఫొటోలు షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఫొటోలను దేశం అప్పుడే చూసింది. కానీ నది ఒడ్డున తమ బంధువుల శవాలు విడిచి వెళ్తున్నవారి మనోవేదనను మనం అర్థం చేసుకోవాలి. అది వారి తప్పిదం కాదు.''
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
గంగా నదిలో ప్రవహిస్తున్న మృతదేహాలు.. కరోనా బాధితులవేనని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: మే 26 నిరసనలకు విపక్షాల మద్దతు