ETV Bharat / bharat

'గడువు తీరిన టీకాలు వాడట్లేదు.. 50% ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం' - ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ఫ్రమ్​ హోమ్​

Expired Covid Vaccines: గడువు తీరిన టీకాలు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది కేంద్రం. అటువంటి టీకాలను వాడటం లేదని స్పష్టం చేసింది.

expired Covid vaccines
expired Covid vaccines
author img

By

Published : Jan 4, 2022, 6:25 AM IST

Expired Covid Vaccines: దేశంలో గడువు ముగిసిన కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఆ వార్తలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. అటువంటి టీకాలను వాడటం లేదని స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో కొవిషీల్డ్​, అక్టోబరులో కొవాగ్జిన్​ టీకాల కాలపరిమితి పొడిగింపునకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్​(సీడీఎస్​సీఓ) ఆమోదించినట్లు తెలిపింది.

"దేశంలో గడువు తీరిన వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపిస్తూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇవి తప్పుదారి పట్టించేవి. అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది

గతేడాది అక్టోబరు 25న కొవాగ్జిన్​ కాల పరిమితిని 9 నెలల నుంచి 12 నెలలకు.. 2021 ఫిబ్రవరి 22న కొవిషీల్డ్​ కాల పరిమితిని ఆరు నుంచి తొమ్మిది నెలలకు పొడిగింపునకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్​(సీడీఎస్​సీఓ) ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోం

Central Govt Employees Work From Home: దేశంలో కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్​ సెక్రటరీ కంటే దిగువ స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటివద్ద నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: టీనేజర్లకు కరోనా టీకా​.. తొలి రోజు ఎంతమందికి అంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.