ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై నిషేధం అమలవుతుందని వెల్లడించింది. వీటి తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి కొత్తగా మరికొన్ని ఆంక్షలు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లకే అనుమతి ఉంటుందని తెలిపింది. 2022 డిసెంబర్ 31 తర్వాత 120 మైక్రాన్ల కవర్లనే అనుమతించనున్నట్లు పేర్కొంది.