ETV Bharat / bharat

'వారు చేసే నేరాలు పెద్దవి- వివరణలు గొప్పవి' - రణ్​దీప్​ సూర్జేవాలా

రైతుల సమస్యల్ని పరిష్కరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ నేత రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా విమర్శించారు. భాజపా ప్రభుత్వం పెద్దపెద్ద నేరాలు చేసి, గొప్పగా వివరణ ఇచ్చుకుంటోందని.. ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా ఎత్తిపొడిచారు.

Centre not willing to solve farmers' issues, want to wear them down: Cong
'వారు చేసే నేరాలు పెద్దవి-వివరణలు గొప్పవి'
author img

By

Published : Dec 26, 2020, 5:00 AM IST

సాగు చట్టాల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మోదీ అన్న వాఖ్యల్ని కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా తిప్పి కొట్టారు. రైతుల సమస్యల్ని పరిష్కరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతుల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు.

"ప్రధాని అన్న మాటల్ని అందరూ విన్నారు. వారు(భాజపా ప్రభుత్వం) పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, వివరణ గొప్పగా ఇస్తారు. రైతుల దుస్థితిని మాత్రం పట్టించుకోరు."

-రణ్​దీప్​ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి

నెల రోజుల నుంచి చలిని కూడా లెక్క చేయకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఉద్యమిస్తోంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఇతరేతర కారణాల వల్ల 44 మంది రైతులు చనిపోయినా పెట్టుబడిదారి(భాజపా) ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేదని విమర్శించారు. ఆందోళన చేస్తోన్న రైతులను ఉగ్రవాదులుగా, పాకిస్థానీలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.