ETV Bharat / bharat

Centre Issues Notice To Social Media : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసులు.. 'వాటిని తొలగించకపోతే అంతే!'

Centre Issues Notice To Social Media Platforms : చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్​ను తొలగించాలని ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. స్పందించకపోతే వాటికి రక్షణను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది.

centre-issues-notice-to-social-media-platforms-to-remove-child-sexual-abuse-content

author img

By PTI

Published : Oct 6, 2023, 9:26 PM IST

Updated : Oct 6, 2023, 9:58 PM IST

Centre Issues Notice To Social Media Platforms : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్​ను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్​లకు నోటీసులు పంపించింది. ఈ సామాజిక మాధ్యమాలు వెంటనే స్పందించకపోతే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వాటికి కల్పిస్తున్న రక్షణను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం, అందులోని కంటెంట్​కు బాధ్యులుగా పేర్కొని విచారణ జరుపుతామని పేర్కొంది.

"భారత్​లో తమ ప్లాట్​ఫామ్​ల నుంచి చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్​ను తొలగించాలని హెచ్చరిస్తూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ నోటీసులు జారీ చేసింది. తమ ప్లాట్​ఫామ్​లలో లైంగిక వేధింపుల కంటెంట్​ను వెంటనే తొలగించడం చాలా ముఖ్యమని చెప్పేందుకు ఈ నోటీసులు ఇచ్చాం. శాశ్వతంగా ఈ కంటెంట్​ను తొలగించాలని ఆదేశించాం. భవిష్యత్​లోనూ ఇలాంటి కంటెంట్ వ్యాప్తి చెందకుండా తగిన మెకానిజం, అల్గారిథాన్ని రూపొందించుకోవాలని స్పష్టం చేశాం."
-నోటీసుల్లో కేంద్రం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్​ 2000, సెక్షన్ 66E, 67, 67A, 67B ప్రకారం.. పోర్నోగ్రాఫిక్​ కంటెంట్​, చైల్డ్​ అబ్యూజ్​డ్​ కంటెంట్ ఉన్న సామాజిక మాధ్యమాలపై ఫైన్, ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది కేంద్రం.

సోషల్‌మీడియాలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
Social Media Safety Precautions : సోషల్​ మీడియా మన జీవతంలో ఒక భాగమైపోయింది. ఏ విషయం తెలుసుకోవాలన్నా చాలా మంది దీనిపైనే ఆధారపడతారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాచార వ్యాప్తిలో ఈ సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో కలిగే ఆనందం, బాధ వంటి భావోద్వేగాలను పంచుకోవటంతో పాటు సమాజంలో చోటుచేసుకునే తాజా సంఘటనలకు సంబంధించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం ముందుకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్నాయి. అయితే వీటి వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేమితో కొందరు.. అత్యుత్సాహంతో మరికొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంలో ఏయే అంశాల్లో జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాకిస్థాన్​లో వికీపీడియా బ్యాన్​.. అదే కారణమట..!

ట్రంప్ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లు పునరుద్ధరణ.. రెండేళ్ల తర్వాత..

Last Updated : Oct 6, 2023, 9:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.