ETV Bharat / bharat

'ఆ ఎరువుల ధరలను పెంచొద్దు'

డీఏపీ, ఎంఓపీ, ఎన్​పీకే వంటి ఎరువుల బస్తాలపై గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్​పీ)ని పెంచొద్దని ఉత్పత్తి సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాత ధరలకే విక్రయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Centre directs fertiliser firms not to hike MRP of non-urea fertilisers; sell at old rates
'యూరియాయేతర ఎరువుల ధరలను పెంచొద్దు'
author img

By

Published : Apr 9, 2021, 3:56 PM IST

యూరియాయేతర ఎరువుల ధరలను పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీల్నిఆదేశించింది. డీఏపీ, ఎంఓపీ, ఎన్​పీకే వంటి ఎరువుల బస్తాలపై గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్​పీ)ని పెంచొద్దని, పాత ధరలకే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో డీఏపీ వంటి ఎరువుల ధరలను తయారీ సంస్థలు ఈనెల ఒకటి నుంచి పెంచాయి. ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించిన కేంద్రం తాజా ఆదేశాలు వెలువరించింది. పాత ధరలకే విక్రయించేందుకు ఎరువుల కంపెనీలు అంగీకరించాయని సమావేశం తర్వాత కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య తెలిపారు.

యూరియాయేతర ఎరువుల ధరలపై నియంత్రణను ఎత్తివేసిన ప్రభుత్వం రాయితీని ఏటా కంపెనీలకు చెల్లిస్తోంది.

మరోవైపు పాత స్టాక్‌ను పాత ధరలకే విక్రయిస్తామని ఇఫ్కో వంటి ఎరువుల కంపెనీలు తెలిపాయి. కొత్తగా ముద్రించిన ధరలు తాత్కాలికమేనని, ఆ ధరను వసూలుచేయబోమని చెప్పాయి.

ఇదీ చూడండి: ముంబయిలో టీకా పంపిణీకి అంతరాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.