ETV Bharat / bharat

'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌'ను ఉగ్రసంస్థగా ప్రకటించిన కేంద్రం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ.. - షేక్ సాజిద్ గుల్​ను ఉగ్రవాదిగా ప్రకటించిన హోం శాఖ

జమ్ముకశ్మీర్​లో కొత్తగా పుట్టుకొచ్చిన హైబ్రీడ్‌ ఉగ్రసంస్థ టీఆర్‌ఎఫ్‌పై కేంద్రం చర్యలు చేపట్టింది. ఆ సంస్థను నిషేధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే టీఆర్​ఎఫ్ కమాండర్​ షేక్ సాజిద్ గుల్​ను యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది.

The Resistance Front a terrorist organization
ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌
author img

By

Published : Jan 6, 2023, 12:15 PM IST

జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా డమ్మీ సంస్థగా పనిచేస్తున్న 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌'(టీఆర్‌ఎఫ్‌)పై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎఫ్‌ను శుక్రవారం ఉగ్రసంస్థగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలను చేపట్టింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది.

"లష్కరే పరోక్ష సంస్థ 2019 నుంచి కార్యకలాపాలు చేపట్టిన టీఆర్‌ఎఫ్‌ ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా యువతను నియమించుకుంటోంది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం, నియామకాలు, పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్‌ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా టీఆర్‌ఎఫ్‌ ప్రభావితం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని అమాయక ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యల పథక రచనకు సంబంధించి ఇప్పటికే టీఆర్‌ఎఫ్‌ సభ్యులు, అనుబంధ వర్గాలపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి " అని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పస్బన్‌-ఈ-అహ్లే-హదీస్‌ పేరుతో టీఆర్‌ఎఫ్‌ను వ్యవహరిస్తుంటారు. ఇక టీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ షేక్‌ సాజిద్‌ గుల్‌ను యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రమాదకరంగా పరిణమించాయని కేంద్రం పేర్కొంది.

The Resistance Front a terrorist organization
కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్

కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన తొమ్మిది నెలల తర్వాత 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' పేరు బయటకు వచ్చింది. 2020 ఏప్రిల్‌ 1వ తేదీన కుప్వారాలోని కెరాన్‌ ప్రాంతంలో మొదలైన ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఈ సంస్థను గుర్తించారు. టీఆర్‌ఎఫ్‌ తొలి తరం కేడర్‌లోని స్థానిక కశ్మీరీలను వాఘా సరిహద్దు మీదుగా పాక్‌కు రప్పించి అక్కడ శిక్షణ ఇచ్చింది. మరికొందరు యువకులను నియంత్రణ రేఖ నుంచి అక్రమంగా భారత్‌లోకి పంపింది. గతేడాది ఆగస్టులో టీఆర్‌ఎఫ్‌ అగ్రనాయకుడు అబ్బాస్‌ షేక్‌ను భారత సైనిక దళాలు కశ్మీర్‌లో అంతమొందించాయి. స్పోర్ట్స్‌ వేర్‌ ధరించిన దళాలు అతడి స్థావరాన్ని చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఇతను గత పదేళ్లుగా వివిధ ఉగ్ర సంస్థల్లో పనిచేశాడు. ఇతర సంస్థల్లో పనిచేసిన పలువురు ఉగ్రవాదులు ఇప్పుడు టీఆర్‌ఎఫ్‌లో కనిపిస్తున్నట్లు దళాలు పేర్కొన్నాయి. ఉగ్రదాడి మొత్తాన్ని బాడీ కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి మరికొంత మంది యువకులను ఆకర్షిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.