ETV Bharat / bharat

1,178 ట్విట్టర్​ ఖాతాలు బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం

రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారం చేస్తోన్న 1,178 ఖాతాలను తొలగించాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ను ఆదేశించింది కేంద్రం. పాకిస్థాన్, ఖలిస్థాన్ వేర్పాటు వాద శక్తులతో సంబంధాలున్న ఈ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే నోటీసులపై స్పందించిన ట్విట్టర్​.. ఫిర్యాదులపై తమ నిబంధనలు, స్థానిక చట్టాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

author img

By

Published : Feb 8, 2021, 3:16 PM IST

Updated : Feb 8, 2021, 9:11 PM IST

Centre asks Twitter to remove 1,178 Pak-Khalistani handles for posting provocative content on farmers' protest
ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న 1,178 ఖాతాలను తొలగించాలని ఆదేశించింది. వెంటనే ఈ ఖాతాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాకిస్థాన్, ఖలిస్థాన్ వేర్పాటు వాదు శక్తులతో వీరికి సంబంధాలున్నట్లు తెలిపింది.

ఈ ఖాతాలకు సంబంధించిన వివరాలను ఫిబ్రవరి 4నే కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ట్విట్టర్​కు పంపింది.

ట్విట్టర్ స్పందన..

కేంద్రం నోటీసులపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. ఫిర్యాదులపై ట్విట్టర్‌ని బంధనలు, స్థానిక చట్టాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు పాటించని పోస్టులను తొలగిస్తామని పేర్కొంది. స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండే పోస్టులను స్థానికంగానే తొలగిస్తామంది. ఫిర్యాదుల సమాచారం ఖాతాదారులకూ తెలియజేస్తామని చెప్పింది. పారదర్శకత, ప్రజాసంభాషణ సాధికారతే తమ లక్ష్యమని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: 'యువత, రైతుల కన్నా వారే మీకు దేవుళ్లు'

Last Updated : Feb 8, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.