ETV Bharat / politics

'ఇందిరమ్మ రాజ్యమని ఊదరగొట్టడమే తప్ప - మహిళల భద్రతకు ప్రాధాన్యం లేదు' - Harish React to 2 Girls Rape Case - HARISH REACT TO 2 GIRLS RAPE CASE

ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం ఘటనపై స్పందించిన హరీశ్​ రావు

Harish Rao React to Two Girls Rape Case
Harish Rao React to Two Girls Rape Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 12:53 PM IST

Harish Rao React to Two Girls Rape Case : రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు ఆందోళన చెందారు. భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇద్దరు​ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని ఆరోపించారు. ఫలితంగా ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

తొమ్మిది నెలల కాంగ్రెస్​ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని హరీశ్​ రావు విమర్శించారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ప్రస్తావించారు. షీ టీమ్స్​, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి భద్రత కల్పించిందని స్పష్టం చేశారు.

కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైందని హరీశ్​ రావు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమాజంలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్​ చేస్తున్నామని హరీశ్​ రావు పేర్కొన్నారు.

అసలేం జరిగింది : హైదరాబాద్​లోని ఐఎస్​ సదన్​ డివిజన్​ పరిధిలో ఓ ప్రైవేటు సంస్థ పునరావాస కేంద్రంలో ఇద్దరు బాలికలు తప్పించుకుని వెళ్లిపోయారు. ఈ కేంద్రంలో జనగామ ప్రాంతానికి చెందిన ఓ బాలిక, మల్కాజిగిరికి చెందిన మరో బాలిక ఆశ్రయం ఉంటున్నారు. వీరి మధ్య స్నేహం పెరిగి తప్పించుకొని వెళ్లిపోవాలని ప్లాన్​ చేసుకుని పారిపోయారు. ఆ ఇద్దరి బాలికలు సెప్టెంబరు 24న రాత్రి 8 గంటల సమయంలో జనగామ చేరుకున్నారు.

అక్కడి బస్టాండ్​ సమీపంలోని ఉన్న పాన్​షాప్ నిర్వాహకుడి దగ్గర ఫోన్​ తీసుకుని పరిచయస్థుడైన నాగరాజుకు ఓ బాలిక ఫోన్​ చేసింది. అతడు వచ్చి ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లిపోయాడు. ఆపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే బాలిక ఒంటరిగా అక్కడే ఉంది. అది గమనించిన పాన్​ షాప్​ నిర్వాహకుడు సాయిదీప్​ ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని చెప్పి బేకరీలోకి తీసుకెళ్లాడు. అక్కడే బేకరి నిర్వాహకుడు రాజు తనపై అత్యాచారం చేశారు.

సెప్టెంబరు 25న మొదటి బాలికను తీసుకెళ్లిన నాగరాజు ఆమెను బస్టాండ్​ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. బాలికల విషయం తెలుసుకున్న సాయిదీప్​, రాజుల స్నేహితుల అఖిల్​, రోహిత్​లు హైదరాబాద్​కు తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరిగి బస్టాండ్​ వద్దే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బాలికను గమనించిన పోలీసులు సైదాబాద్​కు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. భరోసా కేంద్రం నిపుణులు కౌన్సెలింగ్​ ఇప్పించడంతో బాలికలు తమపై ఐదుగురు లైంగిక దాడి చేశారని తెలిపారు. వెంటనే పునరావాస కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఇప్పుడు ఈ విషయంపై హరీశ్​ రావు తీవ్రస్థాయిలో స్పందించారు.

హైదరాబాద్​లో అమానుష ఘటన - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం - Two Girls Were Raped in Telangana

హర్ష సాయి బాధితురాలి మరో ఫిర్యాదు - ఈసారి కంప్లైంట్​ ఏంటంటే? - Complaint on Youtuber Harsha Sai

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.