ETV Bharat / bharat

బుధవారమే మంత్రివర్గ విస్తరణ- 22 మంది కొత్తవారు!

author img

By

Published : Jul 6, 2021, 1:38 PM IST

Updated : Jul 6, 2021, 9:43 PM IST

cabinet expansion
మంత్రివర్గ విస్తరణ

13:36 July 06

బుధవారమే మంత్రివర్గ విస్తరణ- 22 మంది కొత్తవారు!

కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అదే సమయంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం.

ఎందుకింత ప్రత్యేకం?

2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయ మంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.

వరుస సమావేశాలు..

ప్రధాని మోదీ.. కొన్ని రోజులుగా కేంద్రమంత్రులు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో వరుస సమావేశాలు జరుపుతున్న కారణంగా కేబినెట్​ విస్తరణ వార్తలు జోరందుకున్నాయి. తుది జాబితాపై ఇప్పటికే మోదీ- అమిత్​షా చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడుతుందని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం సాయంత్రం మంత్రులతో ప్రధాని కీలక విషయంపై భేటీకానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కారణాలేవీ చెప్పకుండానే ఈ భేటీని రద్దు చేశారు.

మంత్రికి గవర్నర్​ పదవి...

కేంద్ర కేబినెట్​ విస్తరణ నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఇప్పటివరకు కేంద్రమంత్రిగా విధులు నిర్వహించిన  థావర్‌చంద్‌ గెహ్లోత్‌ కూడా ఉండటం గమనార్హం.

ఆ 22మందిలో వీరు...!

అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, జోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీకి మంత్రివర్గంలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. భాజపా మిత్రపక్షాలకు కూడా కేబినెట్​లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్​జేపీ తిరుగుబాటు నేత పశుపతి పరాస్​ కూడా కేబినెట్​లో చేరతారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీకి మంత్రివర్గంలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. బంగాల్​ నేతలకు సైతం ప్రాతినిధ్యం దక్కనుంది.

ఇదీ చూడండి:- ఆ రాష్ట్రానికే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట!

Last Updated : Jul 6, 2021, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.