ETV Bharat / bharat

మోదీ ర్యాలీ రద్దుపై మాటల యుద్ధం.. 'ఫ్లాప్​ షో అని తెలిసే ఇలా..'

author img

By

Published : Jan 5, 2022, 8:04 PM IST

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ రద్దు.. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్‌ సర్కారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపించింది. పంజాబ్‌లో శాంతి భద్రతలు విఫలమైనట్లు ఆరోపించిన మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌.. సీఎం చన్నీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది.

modi punjab rally
modi punjab rally

Modi Punjab rally: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపాలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రూ.వేల కోట్ల అభివృద్ధి పనులను అడ్డుకోవటం బాధాకరమని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజలు ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు.

Modi punjab security

"పంజాబ్‌ ప్రభుత‌్వం అనుసరించిన వ్యూహాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారికి బాధ కలిగించేలా ఉన్నాయి. సభకు ప్రజలు హాజరుకాకుండా చూడాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు ఆటంకం ఎదురైన సమయంలో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.. ఫోన్​లో కూడా అందుబాటులో లేరు."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

అది కుట్రే: అమిత్ షా

Amit shah on Modi Punjab rally: ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవటాన్ని కాంగ్రెస్‌ కుట్రగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కాంగ్రెస్‌ దుశ్చర్యలకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. వరుస ఓటములతో సహనం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ పెద్దలు క్షమాపణ చెప్పాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.

రాష్ట్రపతి పాలన విధించాలి: అమరీందర్

పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమైనట్లు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ఆరోపించారు. ఈ విషయంలో పంజాబ్‌ సీఎం, హోంమంత్రి ఘోరంగా వైఫల్యం చెందినట్లు విమర్శించారు. పంజాబ్‌ సీఎం, హోంమంత్రులకు అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు.

"రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో చన్నీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పంజాబ్​లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్​ సరిహద్దుకు 10కిలోమీటర్ల దూరంలో మోదీ సభాస్థలి ఉంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోతే.. ఇంకా ఏం చేయగలదు? మనకు బలమైన ప్రభుత్వం కావాలి. ఈ ముఖ్యమంత్రి, హోం మంత్రి అధికారంలో కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలి."

-అమరీందర్ సింగ్, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి

జనం లేకే రద్దు..

Modi Punjab rally cancelled: ప్రధాని పర్యటనకు సంబంధించి భాజపా విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. జనం లేక ప్రధాని మోదీ ర్యాలీని రద్దు చేసుకొన్నారని ఎద్దేవా చేసింది. తమ ప్రభుత్వంపై భాజపా విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అసత్య ఆరోపణలు చేయటానికి బదులు రైతు వ్యతిరేక విధానాలపై ఆత్మావలోకనం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా హితవు పలికారు.

మోదీ పర్యటన సందర్భంగా.. పంజాబ్​ రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని భాజపా చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర​ మంత్రి రాజ్​కుమార్​ వర్కా తోసిపుచ్చారు.

"ప్రధాని పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేవు. భద్రతా నియమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందనే ఆరోపణలు నిరాధారమైనవి. అసలు నిజమేంటంటే.. పంజాబ్​లో సభ ఫ్లాప్ షో అవుతుందని ప్రధానికి అర్థమైంది. అందుకే ఆయన పలాయనం చిత్తగించారు."

-రాజ్​కుమార్​ వర్కా, పంజాబ్ మంత్రి

ఏమైందంటే?

Modi punjab visit: మోదీ బుధవారం.. పంజాబ్​ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరోజ్​పుర్​లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్​లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. "కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.. సభా వేదికపై ప్రకటించారు. అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: ఎన్నికల రాజకీయాన్ని మార్చిన కరోనా- యూపీ కోసం ఇక డిజిటల్ యుద్ధమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.