Cemetery Caretaker in Election : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. వైశాలి నగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశాడు ఓ కాటికాపరి. చిల్లర డబ్బులు తీసుకువచ్చి మరీ డిపాజిట్ చేశాడు శంకర్ లాల్ సాహు అనే వ్యక్తి. 35 ఏళ్లుగా కాటికాపరి చేస్తున్న ఇతడు.. సుమారు లక్షకుపైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఇప్పటికే ఎమ్మెల్యే, మేయర్ సహా రెండు సార్లు కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. ఐదోసారి పోటీలో ఉన్న శంకర్‌లాల్.. ప్రస్తుతం స్వాభిమాన్ మంచ్ తరఫున వైశాలి నగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

వైశాలి నగర్లో నివసించే శంకర్ లాల్ సాహు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఇతడు భిలాయ్‌లోని రామ్‌నగర్ శ్మశానవాటికలో కాటికాపరిగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గత 35 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న అతడు.. ఇప్పటికి సుమారు లక్షకుపైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని చెబుతున్నాడు. కొవిడ్ సమయంలో సొంత కుటుంబ సభ్యులే.. మృతదేహాలను విడిచిపెట్టి వెళ్తున్న క్రమంలో తాను ఎన్నింటికో అంతిమ సంస్కారాలు చేశానని చెప్పుకొచ్చాడు శంకర్‌లాల్. కరోనా కాలంలో దాదాపు 80 మృతదేహాలను దహనం చేసినట్లు తెలిపాడు. గుర్తు తెలియని మృతదేహాలను సైతం దహనం చేసినట్లు చెప్పాడు. చివరకు ఈ వృత్తిలో కూడా అవినీతి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నెల జీతం రూ.12వేలు కాగా.. దీనిని ఇచ్చేందుకు కూడా కాంట్రాక్టర్ లంచం అడిగాడని వాపోయాడు. మరోవైపు శంకర్‌లాల్.. ఇదే కాకుండా పలు ఛత్తీస్‌గఢ్ సినిమాలు, ఆల్బమ్స్‌లోనూ నటించాడు. ఛత్తీస్‌గఢ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'చార్ చినాహరి నర్వ గర్వ గుర్వ బరి' పాటను సైతం రాశాడు.

'నన్ను గెలిపిస్తే వైశాలినగర్ రూపురేఖలు మారుస్తా'
ఈసారి ఎన్నికల్లో తనను గెలిపిస్తే వైశాలి నగర్ రూపురేఖలు మారుస్తానని శంకర్‌లాల్ హామీ ఇస్తున్నాడు. వైశాలి నగర్ అభివృద్ధి పేరిట ప్రజలు ప్రతిసారి మోసపోతూనే ఉన్నారని చెప్పాడు. నియోజకవర్గం ఇప్పటికే వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు శంకర్‌లాల్.

రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు
Chhattisgarh Elections 2023 : కాగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 20 నియోజకవర్గాల్లో నవంబరు 7న పోలింగ్ జరగనుంది. మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న పోలింగ్ నిర్వహించనున్నారు.
Bhupesh Baghel Properties : నామినేషన్ వేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం.. బఘేల్ ఆస్తులు ఎంతో తెలుసా?