ఏప్రిల్ 25, మహావీర్ జయంతి సందర్భంగా.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రస్తుతం దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే జయంతిని నిర్వహించుకోవాలని సూచించారు.
" లార్డ్ మహావీర్.. అహింసపై తాను చేసిన బోధనలతో మానవాళిలో ఐకమత్యం కోసం కృషి చేశారు. సామాజిక సంస్కరణలు, దేశ శాంతికోసం పాటుపడిన మహావీర్.. దేశంలోనే ప్రముఖ మతగురువుల్లో ఒకరు."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శాంతనగౌడర్ కన్నుమూత