భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సుశీల్ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు కూడా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈసీ అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వారం రోజుల క్రితమే సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్ అరోడా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం సుశీల్‌ను నియమించింది. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో అరోడా పదవీ విరమణతో సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్ ఇద్దరే ఉన్నారు. వీరిద్దరికీ వైరస్ సోకినట్లు ఈసీ అధికారులు తాజాగా వెల్లడించారు.
కాంగ్రెస్ నేతకు..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద శర్మకు కరోనా సోకింది. దీంతో ఆయన.. అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'వలస కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాలి'