భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడినట్లే కనిపిస్తోందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. అయినా సరిహద్దులో భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 25న చేసుకున్న కాల్పులు విరమణ ఒప్పందానికి.. ఇరు దేశాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని జోషి చెప్పారు.
ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంట శాంతి మంత్రాన్ని జపిస్తోందని కానీ దేశ రక్షణ విషయంలో తాము రాజీ పడదలుచుకోలేదని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన దేశంగా భారత్ మానవత్వం, నిగ్రహం, పరిపక్వతతో వ్యవహరిస్తోందన్నారు.
ఇదీ చూడండి: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్-ఇద్దరు మావోయిస్టులు హతం