భారత సైనిక దినోత్సవం సందర్భంగా సైనికుల సేవలకు గుర్తు చేసుకున్నారు త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్. జవాన్ల త్యాగం, శౌర్యం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.
ఈ చారిత్రక రోజు సందర్భంగా వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాం. వారి విధినిర్వహణలో శౌర్యం, త్యాగం, దేశం పట్ల అసమానమైన భక్తి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుంది.
-బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్
వందేళ్ల జవానుకు సత్కారం..
భారత మాజీ జవాను, త్రివిద దళాల్లో సేవలందించిన వీరుడు కల్నల్ ప్రీతిపాల్ సింగ్ (రిటైర్డ్) ఇటీవలే వందో జన్మదినం జరుపుకున్నారు. ఇవాళ వెటరన్ డే సందర్భంగా.. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తరఫున వెండి మెడల్ బహూకరించి ఆయన్ను సత్కరించారు.
ఇదీ చదవండి:'జాతి గర్వాన్ని దెబ్బతీస్తే ఏ శక్తికైనా దీటుగా బదులిస్తాం'