ETV Bharat / bharat

'6వేల కోట్లతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు'.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం - కేబినేట్ నిర్ణయాలు

వాయుసేన కోసం 6,828 కోట్ల వ్యయంతో 70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

union cabinet meeting
union cabinet meeting
author img

By

Published : Mar 1, 2023, 10:36 PM IST

Updated : Mar 1, 2023, 11:04 PM IST

వాయుసేన కోసం 6,828 కోట్ల వ్యయంతో 70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణా యుద్ధ విమానాలు.. వాయుసేనకు ఆరేళ్లలో అందుతాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మెరుగైన శిక్షణకు ఉపయోగపడే ఈ యుద్ధ విమానాలను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల M.S.M.E.లకు కొత్త అవకాశాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబనను బలోపేతం చేసే ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. కొత్తగా చేరిన పైలెట్లకు శిక్షణ యుద్ధవిమానాల కొరత తీరుతుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ వెల్లడించారు.

ccs-approves-procurement-of-70-basic-trainer-aircraft-for-rs-6828-cr
70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు

అంతకుముందు ఫిబ్రవరి 15న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ​ రక్షణ పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ వెంబడి సైన్యం బలోపేతమే లక్ష్యంగా.. ఇండో-టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌కి కొత్తగా ఏడు బెటాలియన్లు మంజూరుచేసింది. ఈ 7 కొత్త బెటాలియన్లలో 9,400 మందిని నియమించనున్నామని తెలిపింది. నూతనంగా నియమించనున్న ఐటీబీపీ సిబ్బందిని 47 కొత్త సరిహద్దు పోస్టుల్లో, 12 స్టేజింగ్‌ క్యాంప్‌లలో ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించింది.

కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద ఉత్తర సరిహద్దుల్లోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం.. వైబ్రంట్‌ విలేజస్ ప్రోగామ్‌ అమలు చేసే ప్రతిపాదనకు ఫిబ్రవరి 15న.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య 4,800 కోట్లతో ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయలతో పాటు జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశమని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

Last Updated : Mar 1, 2023, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.