కాగిత రహితంగా.. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీల్లేని విధంగా 10, 12 తరగతుల బోర్డు పరీక్ష ఫలితాల ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) జారీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) (CBSE news today) సమాయత్తమైంది. ఇందుకుగాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీని (Blockchain Technology) వినియోగించనుంది. ఈ మేరకు 'అకడమిక్ బ్లాక్ చెయిన్ డాక్యుమెంట్ (ఏబీసీడీ)' పేరిట ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల జారీకి ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ధ్రువపత్రాలను సురక్షితంగా పదిలపరచడానికి వీలవుతుంది. 10, 12 తరగతులకు సంబంధించి 2019 నుంచి 2021 వరకు 'డిజిటల్లీ సైన్డ్' ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు సీబీఎస్‌ఈ (CBSE news) ఓ ప్రకటనలో తెలిపింది. క్రమేపీ అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన వాటిని కూడా అందుబాటులోకి తెస్తుంది. బ్లాక్ చెయిన్ సాంకేతికతను(Blockchain Technology) ఉపయోగించి అదనపు భద్రతతో కూడిన లింక్ ద్వారా ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తారు.
ఈ 'ఏబీసీడీ'ని వివిధ విద్యాసంస్థలు ప్రవేశాల సమయంలోను, కంపెనీలు ఉద్యోగాలిచ్చేటప్పుడు ధ్రువీకరణకు వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు కూడా వీటిని వాడుకోవచ్చని సీబీఎస్‌ఈ (CBSE news today) తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు విద్యా రుణాలు, ఉపకార వేతనాలు వంటివాటిని మంజూరు చేసేటప్పుడు కూడా ఈ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చని వెల్లడించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చు. సర్టిఫికెట్లలో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినా భవిష్యత్తులో వీలు కలుగుతుంది. పారదర్శకంగా ధ్రువపత్రాల వినియోగానికి వీలవుతుందని.. దీనిద్వారా పలు సందర్భాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు సమయం ఆదా అవుతుందని సీబీఎస్‌ఈ CBSE news today) తెలిపింది.
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE news) ఇటీవల ఉపశమనం కల్పించింది. అలాంటి వారు వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతి పరీక్షల (CBSE board exams) కోసం ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: సీబీఎస్‌ఈ తరహాలో రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు..?