ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు - సీబీఎస్​ఈ పరీక్షల షెడ్యూల్​

సీబీఎస్​ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 10వ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులను మార్చిన బోర్డు.. 12వ తరగతిలోనూ పలు మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్​ను శుక్రవారం విడుదల చేసింది.

CBSE revises board exam dates for few class 10, 12 subjects
సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీల్లో మార్పు
author img

By

Published : Mar 5, 2021, 8:02 PM IST

ఈ ఏడాది మేలో జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగాయి. మే 4న ప్రారంభమయ్యే ఈ పరీక్షల్లో.. గణితం, భౌతిక శాస్త్రం, కామర్స్ సబ్జెక్టుల టైమ్​టేబుల్​లో పలు మార్పులు చేసింది సీబీఎస్​ఈ.

సవరించిన తేదీలివే..

  • పదో తరగతి విద్యార్థులకు మే 15న జరగాల్సిన సైన్స్​ పరీక్ష.. అదే నెల 21న నిర్వహించనున్నారు.
  • ప్రాథమిక షెడ్యూల్​ ప్రకారం.. మే 21న నిర్వహించదలచిన గణిత పరీక్ష జూన్​ 2కు మారింది.

12వ తరగతి షెడ్యూల్​..

  • సైన్స్​ విభాగం విద్యార్థులకు మే 13న జరగబోయే భౌతిక శాస్త్ర పరీక్షను.. కొత్త షెడ్యూల్​లో జూన్​ 8కి చేర్చింది.
  • కామర్స్​ విభాగంలో జూన్​ 1న నిర్వహించాల్సిన గణితం, అప్లైడ్​ మేథమెటిక్స్​ పరీక్షలు మే 31కి సవరించారు.
  • సోషల్​ విభాగంలో జూన్​ 2న జరగాల్సిన జియాగ్రఫీ పరీక్షను.. మరుసటి రోజు(జూన్​ 3)కు వాయిదా పడింది.

సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు మే 4న పరీక్షలు ప్రారంభమై.. జూన్​ 10న ముగియనున్నాయి.

ఇదీ చదవండి: సీబీఎస్​ఈ విద్యార్థులకు ఊరట- సిలబస్​లో కోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.