అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది బొంబాయి హైకోర్టు. ముంబయి పోలీస్ మాజీ కమిషనర్ పరంవీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరిపి, నేరం జరిగిందనేందుకు ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. జయశ్రీ పాటిల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
ఈ కేసుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ గిరీశ్ కులకర్ణితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ మాజీ కమిషనర్ పరంవీర్ సింగ్ సహా జయశ్రీ పాటిల్, మోహన్ భీదే అనే మరో ఇద్దరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.