వైఎస్ వివేకా హత్య కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఆయన్ను హైదరాబాద్ కార్యాలయానికి రప్పించుకొని విచారించింది. హత్యాస్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి.. విచారణ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు ఈ కేసులో ఇటీవల అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తున్న తరుణంలో రాజశేఖర్‌ను విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, హత్య కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకే రాజశేఖర్‌రెడ్డిని విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది.
వైఎస్ హత్య కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అటు అవినాష్ రెడ్డి కూడా ఈ హత్యకేసులో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వాదిస్తున్నాడు. హత్య ఘటన స్థలంలో లభించిన లేఖ విషయం కోణంలో సీబీఐ విచారణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అటు వైసీపీలో కీలక నేతలు కూడా ఇదే విషయంపై పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల ముందుస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ విచారణ సమయంలో కూడా ఈ లేఖ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఈ లేఖ కూడా విచారణ జరిపామని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో లేఖపై మరిన్ని వివరాలను రాబట్టేందుకే.. వైఎస్ వివేకా రెడ్డి కుమార్తె భర్త అయిన రాజశేఖర్ రెడ్డిని పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో తొలుత సాక్షిగా ఎంపీ అవినాష్ రెడ్డ పరిగణించిన సీబీఐ, తరువాత నిందితుడిగా అబియోగాలను మోపింది. వైఎస్ వివేక హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కీలక పాత్ర పోషించారని సీబీఐ కస్టడీ రిపోర్టులో పొందుపర్చడంతో.. అవినాష్ రెడ్డి తరపు లాయర్లు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. సీబీఐ మొదట్నుంచి ఒకే కోణంలో విచారిస్తోందని, వివేకా హత్య ఘటన ప్రదేశంలో దొరికిన లేఖపై ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు 160 నోటీస్ కింద విచారణకు పిలచి విచారించడం చర్చాంశనీయంగా మారింది.
ఇవీ చదంవడి