ETV Bharat / bharat

పోంజీ స్కాం: రోజ్​ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్ - పోంజీ స్కాంలో సుభ్ర కుందు అరెస్ట్

పోంజీ కుంభకోణం కేసులో సీబీఐ మరొక కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. రోజ్ ​వ్యాలీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ కుందు భార్యను ఈ కేసు విషయంలో విచారించేందుకు అదుపులోకి తీసుకుంది.

Rose Valley group chief
పోంజీ స్కాం: రోజ్​ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్
author img

By

Published : Jan 15, 2021, 5:08 PM IST

రోజ్​ వ్యాలీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ కుందు భార్య సుభ్ర కుందును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. పోంజీ కుంభకోణంలో ఆమె పాత్రపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఆమెను విచారించేందుకు సీబీఐ సహా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ సిద్ధంగా ఉంది. రోజ్ వ్యాలీ గ్రూప్​.. చట్టవిరుద్ధమైన స్కీమ్​లతో ఆశ చూపి వేలాదిమంది డిపాజిటర్లను మోసం చేసింది. ఈ కుంభకోణం విలువ రూ.12 వేల కోట్లపైమాటే అని సీబీఐ వర్గాలు అంటున్నాయి.

ఈ కేసులో ఆమె భర్త గౌతమ్​ కుందు 2015 మార్చి నుంచి జైలులోనే ఉన్నారు. రోజ్​ వ్యాలీ సంస్థ దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రిసార్ట్​లలో భారీ పెట్టుబడులు పెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.