ఐదురాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు.. భారీ స్థాయిలో ప్రలోభాల పర్వం సాగించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, డ్రగ్స్ విలువ రికార్డు స్థాయిలో వేయికోట్లకు పైగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తం 2016తో పోలిస్తే నాలుగురెట్లు పెరిగినట్లు తెలిపింది.
ఏ రాష్ట్రంలో ఎంత?
తమిళనాడులో 446 కోట్ల 28లక్షల విలువైన మద్యం, నగదు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
బంగాల్‌లో ఇప్పటివరకూ 300 కోట్లకు పైగా విలువైన మద్యం, నగదును స్వాధీనం అధికారులు వెల్లడించారు.
అసోంలో 122 కోట్ల 35 లక్షలు, కేరళలో 84 కోట్ల 91 లక్షలు, పుదుచ్చేరిలో 36 కోట్ల 95 లక్షల విలువైన మద్యం, నగదు, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్థాయిలో నగదు, మద్యం పట్టుబడటానికి ఈసీ అవలంబించిన వ్యూహాలు, ఎన్నికల సంసిద్ధత కారణమని వివరించారు.
ఇదీ చూడండి: 45 స్థానాల్లో ఐదో దశ పోలింగ్‌కు 'బంగాల్' సిద్ధం