ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో తొలి 'లవ్​ జిహాద్' కేసు - uttar pradesh love jihad

'లవ్​ జిహాద్' ఆర్డినెన్సు అమలులోకి వచ్చిన తర్వాతి రోజే ఇందుకు సంబంధించిన కేసు వెలుగుచూసింది. బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని నిందితులపై బరేలీలోని దేవరానియా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Case registered under Unlawful Conversion of Religion Ordinance in Bareilly
యూపీలో తొలి 'లవ్​ జిహాద్' కేసు
author img

By

Published : Nov 29, 2020, 11:09 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 'లవ్​ జిహాద్​'కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఈ చట్టం అమలైన తర్వాత తొలిసారి బరేలీలో బలవంతపు మత మార్పిడి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ శనివారం ఆమోదముద్ర వేశారు.

తాజా ఆర్డినెన్సును అనుసరించి దేవరానియా పోలీసులు ఎఫ్​ఐఆర్ రిజిస్టర్ చేశారు. నిందితులపై సెక్షన్ 3/5 ప్రకారం ఆరోపణలు మోపారు. బలవంతంగా మత మార్పిడిని ప్రోత్సహించారని ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు.

పదేళ్ల శిక్ష

బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. యోగి ఆదిథ్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ నవంబర్​ 24న ఈ ఆర్డినెన్సును ఆమోదించింది. దీని ప్రకారం బలవంతంగా మత మార్పిడులకు పాల్పడేవారికి 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మత మార్పిడి కోసమే వివాహం చేసుకున్నట్లైతే.. ఆ వివాహాన్ని చెల్లుబాటుకానిదిగా పరిగణిస్తారు.

ఇటీవలి కాలంలో ఉత్తర్​ప్రదేశ్ సహా భాజపా పాలిత రాష్ట్రాలైన హరియాణా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే 'లవ్​ జిహాద్​'గా అభివర్ణిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.