ETV Bharat / bharat

ఐపీఎస్​ల డిప్యుటేషన్​కు దీదీ సర్కార్ నో

author img

By

Published : Dec 13, 2020, 5:26 PM IST

జేపీ నడ్డా బంగాల్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఐపీఎస్​లను కేంద్ర డిప్యుటేషన్​కు పంపించాలన్న కేంద్రం ఆదేశాలను దీదీ సర్కార్ తిరస్కరించింది. వీరిని వదులుకోలేమని కేంద్రానికి స్పష్టం చేసింది.

Can't spare these officials for Central deputation: Mamata govt's response to MHA's call to 3 IPS
ఐపీఎస్​ల డిప్యుటేషన్​కు దీదీ సర్కార్ నిరాకరణ

డిప్యుటేషన్​పై పనిచేయాలని కేంద్రం నుంచి నోటీసులు అందుకున్న బంగాల్ క్యాడర్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్​లను వదులుకునేది లేదని దీదీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రత్యుత్తరం పంపింది.

కేంద్ర డిప్యూటేషన్​కు రావాలని బంగాల్​ ప్రభుత్వానికి పంపిన నోటీసుపై ఆ రాష్ట్ర యంత్రాంగం స్పందించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

"ముగ్గురు ఐపీఎస్​ అధికారులను కేంద్ర డిప్యుటేషన్​పై పంపించాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలపై బంగాల్ ప్రభుత్వం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. కేంద్ర డిప్యుటేషన్ కోసం వారిని వదులుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది."

-ప్రభుత్వ వర్గాలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటన సందర్భంగా భద్రతాపరమైన విధులు నిర్వర్తించడంలో విఫలమైన నేపథ్యంలో.. డిప్యుటేషన్​పై పనిచేయాలని వీరికి నోటీసులు జారీ చేసింది కేంద్రం. అయితే ఈ ప్రకటనపై అధికార టీఎంసీ ఇదివరకే మండిపడింది. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని, పోలీసులను బెదిరించేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగులను కేంద్రానికి పంపించడం రాష్ట్రాల ఐచ్ఛికమని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.