దేశ రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు సంబంధించిన తేజస్ మార్క్-2 తయారీ కేంద్రాన్ని రాజ్‌నాథ్ కర్ణాటకలో ప్రారంభించారు. తేజస్ అత్యంత శక్తిమంతమైన ఫైటర్ జెట్ అని, చాలా విషయాల్లో విదేశీ యుద్ధవిమానలకంటే మెరుగైనదని ఆయన అన్నారు.
"రక్షణ పరికరాల విషయంలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకూడదు. తేజస్‌పై చాలా దేశాలు ఆసక్తి కనబరిచాయి. కొన్ని సంవత్సరాల్లోనే రక్షణ తయారీ రంగంలో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుంది."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు రూ.48,000 కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్లను సమకూర్చుకోవాలని ఇటీవల మోదీ సర్కార్ నిర్ణయించింది. 2024 మార్చి నుంచి వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఏటా 16 విమానాలను చొప్పున 83 ఫైటర్ జెట్లను వైమానిక దళానికి హెచ్ఏఎల్ అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.మాధవన్ ఇటీవల తెలిపారు.
- ఇదీ చూడండి: తేజస్.. అత్యుత్తమమైన యుద్ధవిమానం-ఎందుకంటే?