ETV Bharat / bharat

'ఆ కేసు విచారణ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు'

మధ్యప్రదేశ్​ జిల్లా న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ జ్యుడీషియల్‌ అధికారిణి‌పై లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న జిల్లా జడ్జి వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం.. ఇలాంటి కేసుల విచారణ నుంచి తప్పించుకోవాలని చూడొద్దని వ్యాఖ్యానించింది.

Can't allow sexual harassment cases to be swept under carpet: SC
'న్యాయవ్యవస్థ ముసుగులో విచారణను తప్పించుకోలేరు'
author img

By

Published : Feb 26, 2021, 9:04 PM IST

మధ్యప్రదేశ్ జిల్లా న్యాయమూర్తి శంభూ సింగ్ రఘువన్షీపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర హైకోర్టు తనపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారిణిపై లైంగిక వేధింపుల అభియోగాలను రఘువన్షీ ఎదుర్కొంటున్నారు. ఈ తరహా కేసుల్లో విచారణను న్యాయవ్యవస్థ ముసుగులో తప్పించుకోలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఉపసంహరించుకోండి..

సీజేఐ జస్టిస్​ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా గల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్​ జూనియర్‌ జ్యుడీషియల్‌ అధికారిణి‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర​ హైకోర్టు తనపై క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌ జిల్లా జడ్జి సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. జిల్లా జడ్జి తన పిటీషన్​ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.

ప్రస్తుత అభియోగంపై చట్టప్రకారం ఎటువంటి పరిష్కారం లేదని.. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంలో హైకోర్టు విచారణ జరుపుతుందని.. ఇది చాలా సున్నితమైన అంశమని సీజేఐ జస్టిస్​ ఎస్ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు.

రఘువన్షీ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది.. అభియోగాలు మోపిన మహిళా అధికారిణి మూడు సందర్భాల్లో సయోధ్యకు అంగీకరించారని తెలిపారు. వీటిని పరిశీలించిన సీజేఐ.. ఆ మూడు నివేదికలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: యువర్​ ఆనర్​ అనొద్దు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.