అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్ మంత్రివర్గంలో (UP Cabinet Expansion News) కీలక మార్పులు చేసింది భాజపా. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించింది. (UP Cabinet Reshuffle) కొత్తగా ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకుంది.
ఇటీవల కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాద మంత్రివర్గంలో (Jitin Prasada latest news) చోటు దక్కించుకున్నారు. బ్రాహ్మణ వర్గం ఓటర్లపై ఈయనకు మంచి పట్టుంది. ఇది తమకు కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
ప్రసాదతో పాటు ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, పల్తూ రామ్, సంగీత బల్వంత్, సంజీవ్ కుమార్, దినేశ్ ఖాటిక్, ధరమ్వీర్ సింగ్‌ను మంత్రివర్గంలో చేర్చుకుంది యోగి సర్కార్.
ఇదీ చదవండి: