ETV Bharat / bharat

రైల్వే ఉద్యోగులకు గుడ్​న్యూస్​- బోనస్​గా 78 రోజుల వేతనం - రైల్వై ఉద్యోగులకు బోనస్​

Railway employees
రైల్వే నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు బోనస్​
author img

By

Published : Oct 6, 2021, 3:41 PM IST

Updated : Oct 6, 2021, 3:58 PM IST

15:39 October 06

రైల్వే నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్‌

రైల్వేలో పని చేస్తున్న నాన్​ గెజిటెడ్​ ఉద్యోగులకు శుభవార్త అందించింది కేంద్రం. 78 రోజుల వేతనం బోనస్​గా ఇవ్వాలని కేంద్రమంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో.. మొత్తం 11.50 లక్షల మంది రైల్వే ఉద్యోగలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. దీని కోసం రూ.1,985 కోట్లు అవసరమవుతాయన్నారు. ఏటా దసరా, దుర్గా పూజా సందర్భంగా ఉద్యోగులకు బోనస్​ ప్రకటిస్తోంది కేంద్రం.  

పీఎం మిత్రా పార్కులు

దేశంలో వచ్చే ఐదేళ్లలో 7 పీఎం మిత్రా పార్కులు ఏర్పాటు చేసేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు చెప్పారు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్​ గోయల్​.  

" 5 ఏళ్లలో 7 పీఎం మిత్రా( మెగా ఇంటిగ్రేటెడ్​ టెక్స్​టైల్​ రీజియన్​, అప్పారెల్​)  పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.4,445 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. "

- పీయూష్​ గోయల్​, కేంద్ర మంత్రి.  

పీఎం మిత్రా పార్కుల ఏర్పాటు ద్వారా నేరుగా 7 లక్షలు, పరోక్షంగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు గోయల్​. 

Last Updated : Oct 6, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.