ఛార్టర్డ్ అకౌంటెట్(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్(ఐసీడబ్యూఏ)కు అర్హత సాధించిన విద్యార్థులను పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించిన విద్యార్థులతో సమానంగా పరిగణిస్తామని యూజీసీ ప్రకటించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్(ఐసీఎస్ఐ) నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
యూజీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో సీఎస్ వృత్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ పేర్కొంది. యూజీసీ నిర్ణయాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సైతం ఆహ్వానించింది.
ఇదీ చదవండి : టీషర్ట్‌లో ఎమ్మెల్యే.. బయటకు పంపిన స్పీకర్