ETV Bharat / bharat

C295 Military Transport Aircraft : భారత​ గడ్డపైకి తొలి C-295 జెట్.. ఎయిర్​ఫోర్స్​లోకి అప్పుడే చేరిక - భారత్​లో అడుగు పెట్టిన c 295 రవాణా విమానం

C295 Military Transport Aircraft : భారత వైమానిక దళానికి చెందిన మొదటి C-295 రవాణా విమానం గుజరాత్​ వడోదరాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది.

C-295 Transport Aircraft Landed In Vadodara
C-295 Transport Aircraft Landed In India
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 5:37 PM IST

Updated : Sep 20, 2023, 6:51 PM IST

C295 Military Transport Aircraft : భారత వైమానిక దళానికి చెందిన మొదటి C-295 రవాణా విమానం గుజరాత్​ వడోదరాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ల్యాండ్ అయింది. బహ్రెయిన్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఈ విమానాన్ని తొలిసారిగా గ్రూప్ కెప్టెన్ పీఎస్ నేగి నడిపారు. కాగా, దీనిని ఫ్రాన్స్​కు చెందిన ఎయిర్​బస్​ డిఫెన్స్​ అండ్​ స్పేస్​ సంస్థ ఈ తొలి C-295 ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్​క్రాఫ్ట్​ను సెప్టెంబర్​ 13న భారత్​కు అందజేసింది. ఎయిర్​బస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి వైమానిక దళపతి ఎయిర్ చీఫ్​ మార్షల్ వీఆర్​ చౌదరి ఈ విమానాన్ని అందుకున్నారు. అనంతరం అదే విమానంలో భారత్​కు చేరుకున్నారు.

ఆ తేదీనే IAFలోకి ఎంట్రీ!
దేశ రాజధాని దిల్లీ సమీపంలోని హిందన్ ఎయిర్‌బేస్‌లో సెప్టెంబర్ 25న జరగనున్న కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విమానాన్ని అధికారికంగా భారత వైమానిక దళంలోకి చేర్చనున్నారు. మొత్తం 56 విమానాలు IAFలోకి ప్రవేశించనున్నాయని.. వాటిల్లో 40 టాటా-ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలో తయారుచేసినవే అని IAF అధికారులు తెలిపారు.

  • The first C-295 transport aircraft of the Indian Air Force landed at Air Force Station, Vadodara a few minutes ago. The aircraft was flown by Group Captain PS Negi and landed today after taking off from Bahrain: IAF officials to ANI

    (file photo) pic.twitter.com/lZg1ri6SE7

    — ANI (@ANI) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణ స్పెయిన్​​ నగరం సెవిల్లే నుంచి సెప్టెంబర్​ 15న బయలుదేరిన ఈ విమానం ఈజిప్టు, మాల్టా, బెహ్రెయిన్​లో ఆగి.. బుధవారం వడోదరాలోని ఎయిర్​బేస్​కు చేరుకుంది. కాగా, ఆర్డర్​ చేసిన మొత్తం విమానాలు డెలివరీ అయితే.. ప్రపంచంలోనే భారత వైమానిక దళం అతిపెద్ద C-295 అపరేటర్​ అవుతుందని భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది.

"ఈ పరిణామం కేవలం దేశానికే కాదు భారత వాయుసేనకు ఒక కీలక మైలురాయి. వాయుసేనలోకి ఈ ఎయిర్​క్రాఫ్ట్​ల రాక.. వాయుసేన వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. అలాగే దేశంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది."

-వీఆర్​ చౌదరి, ఎయిర్ చీఫ్​ మార్షల్

C295 Aircraft Specifications : అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయాల్లో సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ C-295 విమానం ఉపయోగపడుతుంది. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం 71 ట్రూప్స్​ను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు. పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సీ-295 ఎయిర్​క్రాఫ్ట్​ వెళ్లగలదు. మిలిటరీ లాజిస్టిక్స్​ కోసం ఉపయోగించే ఉన్నతమైన విమానంగా ఈ సీ-295 ప్రసిద్ధి చెందింది. ఈ విమానాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్​ వార్ ఫేర్ సూట్​లను వినియోగించారు. ఇక వీటి తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్​ఎస్​ఎమ్​ఈలు కీలక పాత్ర పోషించనున్నాయి.

  • The IAF's first C-295 MW aircraft landed in Vadodara today. The aircraft would be handed over to the IAF in a formal ceremony on 25 September 2023 at AF Stn Hindan by the Honourable Raksha Mantri Shri Rajnath Singh: Indian Air Force pic.twitter.com/a0B18VWYS1

వాటి స్థానంలో..!
ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​(IAF)ను ఆధునీకరించడమే లక్ష్యంగా రెండేళ్ల క్రితం భారత వైమానిక దళం, ఎయిర్​బస్​ మధ్య రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఎయిర్​బస్​ 2025 చివరి నాటికి 'ఫ్లై-అవే' స్థితిలో మొదటి 16 విమానాలను అప్పగించనుంది. మరో 40 విమానాలను భారత్​లో.. టాటా అడ్వాన్స్​డ్​ సిస్టమ్స్​ తయారు చేసి.. అసెంబుల్ చేస్తుంది. వాయుసేనకు చెందిన అవ్రో విమానాల స్థానంలో ఈ C-295 విమానాలను భర్తీ చేయనున్నారు.

Last Updated : Sep 20, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.