ETV Bharat / bharat

భాజపా- సేన స్నేహగీతం- 'కూటమి' కోటకు బీటలు? - సంజయ్​ రౌత్​

మహారాష్ట్రలో రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. శివసేన, భాజపా మధ్య శత్రుత్వం లేదని ఇరుపార్టీలు ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్​ ఆఘాడీ కూటమికి బీటలు వారనున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

Shiv Sena, bjp, maha politics
మహారాష్ట్ర భాజపా, శివసేన
author img

By

Published : Jul 5, 2021, 2:25 PM IST

Updated : Jul 5, 2021, 7:02 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ కూటమికి బీటలువారనున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. మహావికాస్​ ఆఘాడీపై ఒంటి కాలిపై లేచిన మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్​ ఉన్నట్టుండి స్వరం మార్చారు. భాజపా, శివసేనకు మధ్య శత్రుత్వం ఏమీ లేదని అన్నారు. ఇదిలా ఉంటే శివసేన కీలక నేత సంజయ్​ రౌత్​ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలను బలపరుస్తున్నాయి.

ఫడణవీస్​ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్​ షాను కలిసిన సమయంలో శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించినట్లు మహా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వీటిని నిజం చేసేలా.. పఢణవీస్ తాజాగా చేసిన​ వ్యాఖ్యలు చేశారు.

"భాజపా, శివసేన ఎప్పుడూ శత్రువులు కాదు మిత్రులే. ప్రజాభివృద్ధి కోసమే వ్యతిరేకంగా పోరాడాయి. వారు ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మమ్మల్ని విడిచిపెట్టారు"

-దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత

ఇదిలా ఉంటే మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

"భాజపా, శివసేనలు శత్రువులు కాదని దేవేంద్ర ఫడణవీస్​ అన్నారు. ఈ మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. అయితే దీని అర్థం ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కాదు."

-చంద్రకాంత్​ పాటిల్, మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు

ఇదే విషయంపై కేంద్రమంత్రి రామ్​దాస్​ అఠవాలే కూడా స్పందించారు. శాసనసభ ఎన్నికలు పూర్తి అయ్యి.. ముఖ్యమంత్రి ఎవరూ అనే ప్రశ్న తలెత్తినప్పుడు తాను రెండన్నర ఏళ్ల పాటు శివసేనకు ఆ అవకాశం ఇవ్వమని ఫడణవీస్​కు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ సమయం ఫడణవీస్​ నా మాట విని ఉంటే నేడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే వారని గుర్తు చేశారు.

మాది ఆమీర్​, కిరణ్​రావుల బంధం...

భాజపా, శివసేన మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ స్పష్టం చేశారు. తామేమి భారత్​-పాకిస్థాన్​లా కాదని పేర్కొన్నారు. రాజకీయంగా మా దారులు వేరు కానీ మా మైత్రీబంధంపై ఆ ప్రభావం ఉండదని పేర్కొన్నారు. తమది ఆమిర్​ ఖాన్​, కిరణ్​రావుల మధ్య ఉండే బంధంగా చూడాలన్నారు.

ఇరు పార్టీ నేతల ప్రకటనలతో మహారాష్ట్రలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

ఇదీ చూడండి: 'శివసేన ఎప్పడూ మా శత్రువు కాదు'

Last Updated : Jul 5, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.