ETV Bharat / bharat

షూ వేసుకుని ఐసీయూలోకి వెళ్లిన మేయర్​.. అడ్డుచెప్పిన ఆస్పత్రి స్టాఫ్​.. ఆగ్రహంతో బుల్డోజర్​ను పిలిపించి..​

Bulldozer Action in up Today on Hospital : ఐసీయూ గదిలోకి రానివ్వలేదని ఆసుపత్రిపై బుల్డోజర్ చర్యకు సిద్ధపడ్డారు ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ మున్సిపల్​ కార్పొరేషన్​​ మేయర్​. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి వెళ్లొద్దన్నందుకు ఆస్పత్రి స్టాఫ్​తో గొడవపడి.. బుల్డోజర్ చర్యకు పిలుపునిచ్చారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర రసాభాస జరిగింది.

bulldozer-was-called-to-hospital-in-lucknow-when-mayor-was-stopped-from-wearing-shoes-in-icu
షూ వేసుకుని ఐసీయూ గదిలోకి రావద్దన్నందుకు ఆస్పత్రిపై బుల్​డోడ్జర్ యాక్షన్​కు సిద్ధపడ్డ​ మేయర్​
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 9:07 PM IST

Bulldozer Action in up Today on Hospital : ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రైవేటు ఆస్పత్రిపై బుల్డోజర్ చర్యకు పిలుపునిచ్చారు లఖ్​నవూ మున్సిపల్​ కార్పొరేషన్​​ మేయర్. తనను ఐసీయూ గదిలోకి రానివ్వలేదనే కారణంతో.. మేయర్​ ఈ చర్యకు సిద్ధపడ్డారు. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తుండగా అడ్డుకున్నామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. మేయర్ మాత్రం ఆస్పత్రి సిబ్బంది ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.

ఆసుపత్రి మేనేజ్​మెంట్​ చెప్పిన వివరాల ప్రకారం..
బిజ్​నోర్​లో ఉన్న వినాయక్ మెడికేర్ ఆస్పత్రిలో.. మున్సిపల్​ ఉద్యోగి ఒకరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆ రోగిని చూసేందుకు మిగతా సిబ్బందితో కలిసి.. లఖ్​నవూ మున్సిపల్​ మేయర్​ సుష్మా ఖర్వాల్ సోమవారం అక్కడికి వెళ్లారు. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తున్న ఆమెను.. అస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. షూ వేసుకుని లోపలికి వెళితే సూక్షజీవుల కారణంగా.. రోగి ఇన్ఫెక్షన్​ బారిన పడతారని హెచ్చరించారు. షూ విప్పేసి ఐసీయూ గదిలోకి వెళ్లాల్సిందిగా ఆమెను కోరారు.

దీంతో ఆగ్రహానికి గురైన మున్సిపల్​ మేయర్ సుష్మా ఖర్వాల్​​.. ఆస్పత్రి సిబ్బందిపై దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే మేయర్​, ఆస్పత్రి మేనేజ్​మెంట్​కు​ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బుల్డోజర్ ఆస్పత్రి వద్దకు రావాలని మున్సిపల్​ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్​ను ఆదేశించారు మేయర్​. వెంటనే వారంతా అక్కడికి చేరుకోవడం వల్ల ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర రసాభాస జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ప్రస్తుతానికి ఆస్పత్రిపై మున్సిపల్​ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆస్పత్రి నిర్మాణం అక్రమంగా జరిగిందని మున్సిపల్​ అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. మరికొద్ది రోజుల్లో ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. అయితే షూ వేసుకుని ఐసీయూ గదిలో వెళ్లిన ఆరోపణలను మేయర్​ సుష్మా ఖర్వాల్ ఖండించారు​​. తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులు కూడా ఆస్పత్రికి మేనేజ్​మెంట్​కు అందించినట్లు ఆమె వివరించారు. ఆస్పత్రి అక్రమ నిర్మాణంపై విచారణ జరుగుతోందని మేయర్​ వెల్లడించారు.

'నేషనల్​ ఐకాన్'​గా సచిన్ తెందుల్కర్.. ఈసీతో ఒప్పందం.. ఏం చేయాలంటే..

'భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు భర్తకు సెలవులు.. చట్టం చేయాల్సిందే'.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.