Building Collapse Gurugram: హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ ఘటన గురుగ్రామ్‌లోని సెక్టార్ 109 పరిధిలో సింటెల్స్ పారాడిసో హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో చోటుచేసుకుంది.
డైనింగ్ రూమ్ భాగంలో ఆరో అంతస్తు నుంచి కిందికి అన్ని అంతస్తుల్లో పైకప్పులు కూలిపోయాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పలువురు జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా చేరుకొని శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇదీ చదవండి: మహిళలతో బాడీ మసాజ్ కోసం దొంగతనాలు.. రూ.వేలల్లో టిప్పు