ETV Bharat / bharat

'సాగు సెగ' మధ్య పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు - ఈటీవీ భారత్​

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభను నిర్వహిస్తారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

budget-session-set-to-be-stormy
రైతు నిరసనల మధ్య పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు
author img

By

Published : Jan 28, 2021, 5:35 PM IST

దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్న తరుణంలో.. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్​తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రాష్ట్రపతి ప్రసంగంతో..

శుక్రవారం.. ఇరుసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేసే ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది.

అయితే సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్షానికి చెందిన 16 పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశాయి.

కొవిడ నిబంధనలు..

గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ సమావేశాలు జరుగుతాయి.

కరోనా కారణంగా పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు రద్దు అయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్​లో జరిగిన సమావేశాల్లో.. శని, ఆదివారాల్లోనూ పార్లమెంట్​ కార్యకలాపాలు సాగించాయి. ఈసారి మాత్రం ఆయా రోజుల్లో సభలు ఉండవు.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను రెండు భాగాలుగా విభజించింది కేంద్రం. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్​ మార్చి 8న తిరిగి సమావేశమవుతుంది.

కాగితరహితంగా...

కరోనా నేపథ్యంలో కాగిత ప్రతులు లేకుండానే బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందువల్ల.. సభ ముందుకు బడ్జెట్​ ప్రతులు, ఆర్థిక​ సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు.

ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్​లను చట్టాలుగా మార్చేందుకు.. సంబంధిత బిల్లులను ఇరు సభల ముందుకు తీసుకురానుంది కేంద్రం.

'గేమ్​ఛేంజర్​..'

కరోనా సంక్షోభం వేళ.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ను గేమ్​ఛేంజర్​గా అభివర్ణించింది అధికార భాజపా. దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆ రోజున ఒక కొత్త శకం మొదలవుతుందని పేర్కొంది.

కాంగ్రెస్​ మాట...

2020-21 బడ్జెట్​లోని సవరించిన అంచనాలనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తిరిగి ప్రవేశపెడతారనే భయం తమలో ఉందని కాంగ్రెస్​ పేర్కొంది. ఏడేళ్ల భాజపా పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఆరోపించింది.

ఇదీ చూడండి:- పార్లమెంట్​ క్యాంటీన్​లో రాయితీకి స్వస్తి.. కొత్త ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.