ETV Bharat / bharat

'ఫలప్రదంగా బడ్జెట్​ సమావేశాలు'

author img

By

Published : Mar 25, 2021, 10:39 PM IST

పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలు మొత్తం 18 బిల్లులకు ఆమోదం తెలిపాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి వెల్లడించారు. ఈసారి బడ్జెట్​ సమావేశాలు ఫలప్రదంగా సాగాయాన్నారు. ఏప్రిల్​ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను నేతల విజ్ఞప్తి మేరకు గురువారంతో ముగించినట్లు తెలిపారు.

joshi
'బడ్జెట్​ సమావేశాలు మెరుగైన ఫలితాయి అందించాయి'

ఈసారి బడ్జెట్​ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయని వ్యాఖ్యానించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. అఖిల పక్షాల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఉభయసభలు 18 బిల్లులకు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. గురువారంతో పార్లమెంట్​ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.

"బడ్జెట్​ సమావేశాల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ సమావేశాలు షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్​ 8 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా.. సమావేశాలను ముందుగానే ముగించాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు గురువారంతో సమావేశాలు ముగిశాయి."

-ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

మొత్తంగా లోక్​సభలో 24 సమావేశా​లు, రాజ్యసభలో 23 సమావేశాలు జరిగాయని జోషి వెల్లడించారు. ఈసారి మొత్తం 20 బిల్లులు (17 లోక్​సభలో, 3 రాజ్యసభలో) ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. లోక్​సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయన్నారు.

ఇదీ చదవండి : 'ఎన్నికల సంఘం​ విధుల్లో భాజపా జోక్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.