ETV Bharat / bharat

IAS కావాలనుకొని 'BTech పానీపూరివాలా'గా- యువతి సక్సెస్​ స్టోరీ అదుర్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 7:37 PM IST

Updated : Nov 22, 2023, 7:44 PM IST

BTech Panipuri Girl Success Story : ఐఏఎస్​ కావాలని కలలు కన్న ఓ యువతి.. పానీపూరి వ్యాపారాన్ని ప్రారంభించింది. అంచలంచెలుగా వ్యాపారాన్ని విస్తరించి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక స్టాళ్లను తెరిచింది. బీటెక్​ పానీపూరివాలా వ్యవస్థాపకురాలు తాప్తీ ఉపాధ్యాయ్​ కథేంటో తెలుసుకుందాం..

BTech Panipuri Girl Success Story
BTech Panipuri Girl Success Story
IAS ప్రయత్నాల నుంచి BTech పానీపూరివాలా

BTech Panipuri Girl Success Story : పానీపూరి.. చిన్నాపెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుని మరీ తినే ఆహారం. ముఖ్యంగా అమ్మాయిల గురించి అయితే.. చెప్పనక్కర్లేదు. కానీ, పానీపూరి అంటే పరిశుభ్రత ఉండదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఆరోగ్యకరమైన, నాణ్యమైన పానీపూరిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఓ యువతి. ఇందుకోసం బీటెక్​ చదువుతున్న సమయంలోనే బీటెక్​ పానీపూరివాలా పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది. అంచలంచెలుగా వ్యాపారాన్ని విస్తరించిన యువతి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది.

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చెందిన తాప్తీ ఉపాధ్యాయ్​ బీటెక్​ పానీపూరివాలా అనే వ్యాపారాన్ని ప్రారంభించి.. దేశవ్యాప్తంగా విస్తరించింది. విహార యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం దొరకడం కష్టం అవుతుందని.. ఇలాంటి సమస్యలను అనేక సార్లు తాను ఎదుర్కొన్నానని అందుకే ఈ ఆలోచన వచ్చిందని తాప్తీ చెప్పింది. అనేక ఉత్పత్తులపై పనిచేసిన తాప్తి.. చివరకు పానీపూరి వ్యాపారాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో బీటెక్​ కంప్యూటర్​ సైన్స్​ చదువుతున్న నేపథ్యంలో దీనికి 'బీటెక్​ పానీపూరివాలా' అని పేరు పెట్టింది. తొలుత బండిపై దిల్లీలోని తిలక్​నగర్​లో తిరుగుతూ పానీపూరి అమ్మింది. ఆ తర్వాత తిలక్​నగర్​, హరినగర్​ సహా అనేక ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఇచ్చిన హెల్తీ ఇండియా పిలుపుతోనే తాను వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పింది తాప్తీ.

ఎప్పటికప్పుడు పానీపూరి రుచిని మెరుగుపరించేందుకు తమ బృందం పనిచేస్తూనే ఉంటుంది. మహిళా సాధికారత కోసం నా వంతు కృషి చేస్తున్నా. మా సంస్థలో 50కి పైగా ఉద్యోగులు ఉండగా.. అందులో 90 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. మరే ఇతర సంస్థతో మేము పోటీ పెట్టుకోము. మా ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాం. దేశవ్యాప్తంగా అనేక కాల్స్ వస్తుంటాయి. అందుకోసమే మేము ఓ ఆఫీస్​ను నిర్వహిస్తున్నాం.
--తాప్తీ ఉపాధ్యాయ్​, బీటెక్​ పానీపూరివాలా వ్యవస్థాపకురాలు

స్వీట్ల వ్యాపారంలోకి ప్రవేశం
పానీపూరి వ్యాపారంలో ఎదిగిన తాప్తీ.. ప్రస్తుతం స్వీట్లపైన దృష్టి పెట్టింది. దీపావళి సందర్భంగా షుగర్​, కోవా లేకుండా కేవలం ఆర్గానిక్​ డ్రై ఫ్రూట్స్​ను ఉపయోగించి స్వీట్లను తయారు చేసింది. వీటిని మార్కెట్​లోకి విడుదల చేయగా మంచి ఫలితాలు వచ్చాయని తాప్తీ సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా తల్లిదండ్రులకు ఓ కారును సైతం బహుమతిగా ఇచ్చింది తాప్తీ.

IAS కల నెరవేరకపోయినా..
ఐఏఎస్​ కావాలన్న తన లక్ష్యం నెరవేరకపోయినా.. హెల్తీ పదార్థాలను ఉత్పత్తి చేసి ప్రజలకు సేవ చేస్తున్నాని చెప్పింది తాప్తీ. దేశవ్యాప్తంగా అనేక మంది ఫ్రాంచైజీలు కావాలని సంప్రదిస్తున్నారని తెలిపింది. దిల్లీతో పాటు గుజరాత్​, బిహార్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లోనూ స్టాళ్లను విస్తరించింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం 10వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఇవ్వకుండా.. తామే సొంతంగా ఔట్​లెట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో షుగర్​ లేని స్వీట్లను ఉత్పత్తి చేస్తామని వివరించింది.

BTech Panipuri Girl Success Story
తండ్రితో తాప్తీ
BTech Panipuri Girl Success Story
తాప్తీ ఉపాధ్యాయ్

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్​

నేలపైనా, నీటిపైనా రయ్​రయ్- హోవర్​క్రాఫ్ట్ రూపొందించిన సూపర్ లేడీ సుప్రీత

Last Updated : Nov 22, 2023, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.