ETV Bharat / bharat

'సార్వత్రిక సమరంలో ఒంటరి పోరు- ఎన్నికల తర్వాత పొత్తు'- రిటైర్మెంట్​పై మాయావతి క్లారిటీ - బీఎస్పీ మాయావతి 2024 ఎన్నికలు

BSP 2024 Lok Sabha Election : లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్​పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎన్నికల తర్వాతే పొత్తు గురించి ఆలోచిస్తామని చెప్పారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు.

bsp-2024-lok-sabha-election
bsp-2024-lok-sabha-election
author img

By PTI

Published : Jan 15, 2024, 12:50 PM IST

Updated : Jan 15, 2024, 1:34 PM IST

BSP 2024 Lok Sabha Election : 2024 సార్వత్రిక ఎన్నికలను బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ-BSP ఒంటరిగానే ఎదుర్కొంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి తెలిపారు. ఎన్నికల అనంతర పరిస్థితులను బేరీజు వేసుకొని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచనేది లేదని ఆదివారం లఖ్​నవూలో స్పష్టం చేశారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింల మద్దతుతో తాము 2007లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అదే భరోసాతో ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగా వెళుతున్నామని పేర్కొన్నారు. కులతత్వం, మతతత్వాన్ని విశ్వసించే వారితో దూరంగా ఉంటామని, ఏ కూటమిలోనూ చేరబోమని అన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి ఉపాధి కల్పించకుండా కేంద్రం, యోగి సర్కార్ ఉచిత రేషన్ అందించి వారిని తమ బానిసలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

  • VIDEO | "Instead of uplifting people from poverty and providing them employment, the central and state (UP) governments are providing them with some free ration and trying to make them their salves. However, our government in UP had provided people employment to empower them,"… pic.twitter.com/gUzzufuqd6

    — Press Trust of India (@PTI_News) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కూటముల్లో చేరడం వల్ల మా పార్టీకి ఎప్పుడూ ప్రయోజనం కలగలేదు. ప్రతిసారి మాకు నష్టమే జరిగింది. అందుకే చాలా పార్టీలు మాతో జట్టుకట్టేందుకు ఆసక్తితో ఉన్నాయి. మేమైతే ఎన్నికల తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం. ఫలితాల తర్వాత అవసరమైతే ఎవరికైనా మద్దతు ప్రకటిస్తాం. పోటీ మాత్రం ఒంటరిగానే ఉంటుంది.

గత నెలలో ఆకాశ్ ఆనంద్​ను నా రాజకీయ వారసుడిగా ప్రకటించిన తర్వాత నుంచి నా రిటైర్మెంట్​పై వార్తలు వస్తున్నాయి. త్వరలోనే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. పార్టీ బలోపేతానికి నేను పనిచేస్తూనే ఉంటా."
-మాయావతి, బీఎస్​పీ అధినేత్రి

ఎస్​పీ, కాంగ్రెస్​పై విమర్శలు
రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్​వాదీపైనా మాయావతి విమర్శలు గుప్పించారు. సమాజ్​వాదీని బడా వ్యాపారులకు చెందిన పార్టీగా పేర్కొన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 'వెనుకబడిన తరగతుల వారు తమ హక్కులు కోల్పోతున్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తిగా అందుకోలేకపోతున్నారు. మీరంతా బీఎస్​పీలో చేరి అధికారాన్ని చేజిక్కించుకోవాలి. కార్యకర్తలంతా శాయశక్తులా పనిచేసి 2024 ఎన్నికల్లో బీఎస్​పీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేయాలి' అని మాయావతి పిలుపునిచ్చారు.

టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!

ఇండియా కూటమి ఛైర్​పర్సన్​గా ఖర్గే- పదవికి నో చెప్పిన నీతీశ్- సీట్ల సర్దుబాటుపై అంతా పాజిటివ్!

Last Updated : Jan 15, 2024, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.