సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) చేపట్టిన చర్యలపై వార్షిక నివేదికను విడుదల చేశారు డీజీ రాకేశ్ ఆస్తానా. గతేడాది సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్, నగదు పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 2,786 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. 632 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
55 తుపాకులు, 4,223 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అస్తానా.. 22మంది చొరబాటుదారులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. 165మంది చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
"గతేడాది 4 సొరంగాలు, 61 డ్రోన్లు గుర్తించాం. బంగ్లాదేశ్ సరిహద్దులో 12,881 కిలోల డ్రగ్స్ పట్టుకున్నాం. 61 ఏకే సిరీస్ తుపాకులు, 7,976 మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. "
--రాకేశ్ ఆస్థానా, బీఎస్ఎఫ్ డీజీ.
ఇదీ చదవండి:పారామిలటరీలో వీఆర్‌ఎస్‌లు అధికమే