Tribal child thrown from terrace: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో అమానుష ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ తీశాడనే అనుమానంతో ఓ బాలుడిని భవనం రెండో అంతస్తు నుంచి తోసేశాడు కిరాతకుడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో హోటల్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ జరిగింది: ఓ గిరిజన బాలుడు ఓ వ్యాపారితో కలిసి రాయ్‌పుర్‌కు వచ్చాడు. హోటల్ నిర్వాహకుడి మొబైల్‌ను మరచిపోయి తన వద్దే ఉంచుకున్నాడు. తన ఫోన్ తీశావంటూ.. ఆగ్రహానికి గురైన యజమాని బాలుడిపై దాడి చేశాడు. ఫోన్ తీసుకుని అతడి బట్టలు విప్పి వీడియో తీశాడు. ఆ తర్వాత చిన్నారికి బలవంతంగా మద్యం తాగించాడు. అతడి బట్టలు విప్పి మరీ కొట్టాడు. అయినా కోపం చల్లారని నిర్వాహకుడు.. బాలుడ్ని హోటల్ రెండో అంతస్తు నుంచి కిందకు విసిరాడు. ఆపై బాలుడు భయంతో పరిగెత్తి.. కిటీకీలోంచి జారిపడ్డాడని నమ్మ బలికాడు. తీవ్ర గాయాల పాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాలుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో హోటల్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఇసుక ప్రియుడు'.. 40 ఏళ్లుగా అదే ఆహారం!