BRS Request to EC over Rythu Bandhu Issue : కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నాలుగు కోట్ల మందికి సంబంధించిన రైతుబంధు చెల్లింపులు నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని భారత రాష్ట్ర సమితి ప్రశ్నించింది. రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలను ఉప సంహరించుకోవాలని ఈసీని కోరిన బీఆర్ఎస్.. రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు చెల్లింపులను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం అందించారు.
'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ
రైతుబంధు అంశం ఏ పార్టీకి సంబంధించిన అంశం కాదని, రైతులకు సంబంధించిన అంశమని పార్టీ తెలిపింది. రోగికి ఆపరేషన్ చేసే టైమ్‌లో అవసరమైన ఇంజక్షన్ ఇప్పుడు వద్దు.. 15 రోజుల తర్వాత తీసుకోవాలని చెప్పినట్లుందని వ్యాఖ్యానించింది. ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ గతంలో ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదని, ఈ విషయంలో సీఈవో కూడా ఆశ్చర్యపోయారని కేశవరావు తెలిపారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్న ఆయన.. నోటీసు ఇచ్చి ఉంటే సమాధానం చెప్పేవాళ్లమని అన్నారు. ఈసీ అక్రమంగా ఆదేశాలు ఇచ్చిందని.. లక్షల మంది రైతులకు, దేశానికి నష్టం జరుగుతుందని కేకే పేర్కొన్నారు.
'మంగళవారం రైతుబంధు డబ్బులు పడి రైతుల ఫోన్లు టంగుటంగుమని మోగుతాయి'
కాంగ్రెస్ పార్టీ కూడా ఆంక్షలు పెట్టాలని చెప్పిందని కేశవరావు అన్నారు. దిల్లీలోని ఈసీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేశవరావు తెలిపారు. బీఆర్ఎస్ను దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. రాజకీయాలు, కోపతాపాల కోసం రైతులకు నష్టం చేయవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రైతుబంధు చెల్లింపుల కోసం ఈసీ నుంచి రేపటి వరకు ప్రయత్నం చేస్తామన్న కేశవరావు.. అనుమతి రాకపోతే ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదని కేకే వ్యాఖ్యానించారు.
రైతుబంధు రగడ - అన్నదాతల నోటికాడి ముద్దను లాగేసిందంటూ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫైర్