CM KCR on TS Assembly Elections 2023 : వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో భారత్ రాష్ట్ర సమితి కీలక సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకుని.. మీటింగ్‌కు హాజరయ్యారు.
CM KCR on BRS Winning Seats in TS Assembly Elections 2023 : రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దశాబ్ది కాలంలో రాష్ట్రాన్ని శతాబ్ది అభివృద్ధి చేశామని హర్షం వ్యక్తం చేశారు. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటక ఫలితాలపై విశ్లేషించారు. దీంతో రాజకీయ నాయకులకు, ప్రజలకు ఈ సమావేశంపై ఉన్న ఉత్కంఠ వీడిపోయింది. అయితే రేపటి మంత్రివర్గ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
20రోజుల వ్యవధిలో మరోసారి మీటింగ్ : బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం 20రోజుల వ్యవధిలో ఇవాళ మరోసారి జరిగింది. గత నెల 27న.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మళ్లీ 20రోజుల వ్యవధిలో.. కర్ణాటక ఫలితాలు వెలువడగానే.. మళ్లీ సమావేశం జరపడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని.. ఆసక్తిగా ఎదురు చూశారు.
తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలే ప్రధాన అంశంగా సమావేశం జరిగింది. రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాలను..21 రోజులపాటు ఘనంగా జరపాలని నిర్ణయించగా రాష్ట్రస్థాయి నేతల నుంచి వార్డు స్థాయి కార్యకర్తల వరకు విస్తృతంగా పాల్గొనడం సహా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిన్నింటిపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరగనున్నందున.. రోడ్‌మ్యాప్‌పై కూడా కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పాలి: ప్రజల్లో నిరంతరం ఉండాలని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం సహా.. ప్రతిపక్షాల ఆరోపణలను ఎక్కడిక్కడ తిప్పి కొట్టాలని కేసీఆర్ కొంతకాలంగా.. ప్రతీ సమావేశంలో చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్షాల విమర్శల దాడి పెరగనున్నందున వాటిని ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం.. తెలంగాణలోనూ ఉంటుందన్న ప్రచారంపై కూడా.. కేసీఆర్ స్పందించవచ్చని పార్టీ శ్రేణుల అంచనా. రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా.. అభివృద్ధి, సంక్షేమం, కొత్త పథకాలు, కార్యక్రమాలపై కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావించారని సమాచారం.
ఇవీ చదవండి: