ETV Bharat / bharat

157 ఏళ్ల నాటి వంతెనపై 138 చక్రాల లారీ.. ఒక్కసారిగా కూలి... - Mp latest news in hindi

మధ్యప్రదేశ్​లో బ్రిటీష్​ కాలం నాటి వంతెన కూలిపోయింది. భోపాల్​-నాగ్​పుర్​ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై గల 40 అడుగుల ఎత్తైన వంతెన.. 138 చక్రాల భారీ వాహనం ప్రయాణించడం వల్ల కుప్పకూలింది.

138 చక్రాల వాహనం.. చేసింది బ్రిటీష్​ బ్రిడ్జి నాశనం..
Bhopal Nagpur Highway bridge collapses
author img

By

Published : Apr 10, 2022, 6:46 PM IST

Updated : Apr 10, 2022, 7:57 PM IST

ప్రమాదంలో కూలిపోయిన వంతెన

మధ్యప్రదేశ్​లో భోపాల్​-నాగ్​పుర్​ జాతీయ రహదారిలో సుఖ్త్వా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. 40 అడుగుల ఎత్తైన ఈ వంతెనను 157 ఏళ్ల క్రితం బ్రిటీష్​ కాలంలో నిర్మించారు. 138 చక్రాలు గల భారీ వాహనం వంతెనపై నుంచి వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్​ సహా నలుగురు గాయపడ్డారు. భారీ యంత్రాన్ని తీసుకెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

బ్రిటీష్​ కాలం నాటి వంతెన కూలిపోవడం వల్ల ప్రస్తుతం హార్దా వైపునకు ట్రాఫిక్​ మళ్లించామని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై నుంచి రోజు సుమారు 5 వేల వాహనాలు ప్రయాణించేవని చెప్పారు. తోషిబా కంపెనీకి చెందిన ఈ వాహనం హైదరాబాద్​ నుంచి ఇటార్సీకి వెళుతోంది.

ఇదీ చదవండి: తుక్కు నుంచి రాజ్​దూత్ బైక్ తయారీ.. కొడుకు కోసం స్పెషల్​గా..

Last Updated : Apr 10, 2022, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.