ETV Bharat / bharat

బ్యూటీ పార్లర్​కు వెళ్లొస్తానని వధువు పరార్​.. వెతికిపెట్టాలని సీఎంకు విజ్ఞప్తి! - పెళ్లి కుమార్తె పరార్

పెళ్లి రోజే పరారైంది ఓ వధువు. బ్యూటీ పార్లర్​కు స్నేహితులతో కలిసి వెళ్తానని చెప్పి మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో బంధువులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

bride absconded on wedding day in Lucknow

author img

By

Published : May 9, 2023, 10:00 PM IST

వివాహ ఉరేగింపునకు అంతా సిద్ధమైంది... బంధువులు, శ్రేయాభిలాషులు అందరూ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.. అంతా సవ్యంగా జరుగుతుందనగా అసలైన ట్విస్ట్ ఇచ్చింది వధువు. స్నేహితులతో కలిసి బ్యూటీ పార్లర్​కు వెళ్లి వస్తానని చెప్పి పరారైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. పరువు పోతుందన్న భయంతో నగరమంతా వెతికారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

లఖ్​నవూలోని ఏరియా సెక్టార్​కు చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. మే 5న వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు వివాహానికి ఏర్పాట్లు చేశారు. వివాహం రోజు బ్యూటీ పార్లర్​కు వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది వధువు. ఎంతకూ తిరిగి రాలేదు. చాలా సేపు ఎదురు చూసిన వధువు కుటుంబ సభ్యులు.. ఆమె కోసం నగరమంతా వెతికారు. ఎంతకీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు కనిపించక నాలుగు రోజులైనా పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారు. దీంతో తమ కుమార్తె ఆచూకీ కనుగొనేలా పోలీసులను ఆదేశించాలని వధువు కుటుంబీకులు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు విజ్ఞప్తి చేశారు.

వధువు సింధూరం చల్లిన వరుడు..
ఇటీవల.. ఇదే తరహాలో అనుకోని ఘటన జరిగింది. మండపంలోనే పెళ్లికి నిరాకరించింది వధువు. ముహుర్తం సమయానికి వరుడు మద్యం సేవించి తనపై సింధూరం చల్లిన కారణంగానే వివాహానికి నో చెప్పింది. చేసేదేం లేక వరుడు కుటుంబసభ్యులు.. తమ ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే?
గత శుక్రవారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా.. వధూవరులు తన బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరారు. ఊరేగింపు మీర్జాపుర్ జిల్లా అహిరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్‌పూర్ వద్దకు చేరుకుంది. గ్రామంలోని ప్రజలు ఊరేగింపునకు ఘన స్వాగతం పలికారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడు.. వధువుకు సింధూరం పెట్టలేకపోయాడు. అందరూ ఎంత చెప్పినా వినకుండా వరుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

పెళ్లైన ఏడు గంటలకే..
'ఆపండీ'... తెలుగు సినిమాల క్లైమాక్స్​లలో వివాహాలను అడ్డుకునేందుకు చెప్పే పాపులర్ డైలాగ్ ఇది. దీనికి కాస్త ట్విస్ట్ ఇచ్చింది ఆ యువతి. వివాహం పూర్తైన తర్వాత, అత్తవారింటికి వెళ్తుండగా ఈ డైలాగ్ చెప్పింది. 'ఆపండీ' అంటూ గట్టిగా అరిచింది. పెళ్లి పూర్తైన తర్వాత ఊరేగింపుగా వెళ్తున్న వాహనాలను ఆపేయించింది. వెంటనే బోరున విలపించింది. ఏడు అడుగులు వేసిన వ్యక్తిని ఏడు గంటల్లోనే వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.