ETV Bharat / bharat

టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే! - కొవిడ్​-19

టీకా తీసుకున్న తర్వాత కూడా వైరస్​ బారినపడుతున్న కేసులు ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కరోనా కొత్త వేరియంట్​ ఏదైనా కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్​తో సహా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న డెల్టా వేరియంట్​.. ఈ బ్రేక్​త్రూ(Breakthrough Infections) కేసులకు కారణమని పరిశోధనల్లో తేలింది.

breakthrough infections
బ్రేక్​త్రూ కేసులు
author img

By

Published : Aug 20, 2021, 4:12 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌(Corona vaccine) తీసుకున్న తర్వాత వైరస్‌ బారినపడుతున్న (Breakthrough Infections) కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇందులో ఎక్కువ శాతం కేసులు.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్​(delta variant in india)కు చెందినవేనని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీనోమ్​ సీక్వెన్సింగ్​ ల్యాబొరేటరీల కన్సార్టియం(ఐఎన్​ఎస్​ఏసీఓజీ-ఇన్​సాకాగ్) వెల్లడించింది.

భారత్​లో కొవిడ్​ కేసులు తగ్గకపోవడానికి, వైరస్​ వ్యాప్తిలో టీకాల సామర్థ్యం అనుకున్న మేర లేకపోవడానికి గల కారణం కూడా డెల్టా వేరియెంటేనని స్పష్టం చేసింది ఇన్​సాకాగ్. అయితే వ్యాధి తీవ్రత, మరణ ముప్పును తగ్గించడంలో మాత్రం టీకాలు మంచి ఫలితాల్ని ఇస్తున్నట్టు తేల్చి చెప్పింది. వైరస్​ కట్టడికి ప్రజారోగ్య చర్యలు ముమ్మరం చేయడం అత్యంత కీలకమని పేర్కొంది.

ఆందోళనకర రీతిలో ఉన్న వేరియంట్లకు సంబంధించి 30,230 నమూనాలను పరీక్షించింగా.. వాటిల్లో 20,324 డెల్టా(delta variant cases in india)కు చెందినవేనని తేలినట్టు ఇన్​సాకాగ్ పేర్కొంది.

"బ్రేక్​త్రూ కేసులకు ఏదైనా కొత్త వేరియంట్​ కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి, దేశంలోని బ్రేక్​త్రూ కేసుల సీక్వెన్సింగ్​లో డెల్టా కేసులే ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి. కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే, వాటిని కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి."

--ఇన్​సాకాగ్

ఈ ఏడాది మార్చి- మే మధ్యలో దేశంలో అల్లకల్లోలం సృష్టించిన కొవిడ్​ రెండో దశకు కారణంగా కూడా డెల్టా వేరియంటే. లక్షలాది మంది కరోనా బారినపడగా.. వేలాది మంది మరణించారు.

మహారాష్ట్రలో జులై నెలలో సేకరించిన కొత్త కేసుల నమూనాల్లో ఏవై.1, ఏవై.2, ఏవై.3(డెల్టా ప్లస్​) వేరియంట్లు 1శాతం ఉన్నాయి. ప్రస్తుతానికి డెల్టా కన్నా ఇవి ప్రమాదకరంగా లేవని స్పష్టం చేసింది ఇన్​సాకాగ్.

భారత్​లోనే కాకుండా.. బ్రిటన్​లోనూ బ్రేక్​త్రూ కేసులు బయటపడుతున్నాయి. 6.7కోట్లకుపైగా జనాభా గల బ్రిటన్​లో ఏప్రిల్​ 2021 నుంచి 1.2లక్షల బ్రేక్​త్రూ కేసులు వెలుగుచూశాయి. అందువల్ల డెల్టా ముప్పు తగ్గేంతవరకు ఈ బ్రేక్​త్రూ కేసుల సమస్య ఉంటుందని తేల్చేసింది ఇన్​సాకాగ్.

ఇదీ చూడండి:- టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.